BREAKING
రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ క్రేజీ థ్రిల్లర్: నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఐ యామ్ గేమ్ సినిమా ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా సౌభాగ్యం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డి సాహెబ్ : పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు : ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ అల్లాబకష్ గుమ్మడి గింజలు చిన్నవే అయినా ప్రయోజనాలు ఎన్నో: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? గ్రామాల సమగ్రాభివృద్ధికై కూటమిని గెలిపించండి : తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జి జి.శంకర్ యాదవ్ పిలుపు - జెడ్పిటిసి అభ్యర్థి మూడే ప్రశాంత్ నాయక్ ని గెలిపించాలని విజ్ఞప్తి పైనాపిల్ తింటే జీర్ణక్రియకు నిజంగా ప్రయోజనకరమేనా? ఈ పండులో దాగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఏమిటి? అవిసె గింజల్లో దాగిన అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? వట్లూరులో కూటమి అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే చింతమనేని ఎన్నికల ప్రచారం చిలగడదుంప తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఆల్వాల్ లో ఘనంగా బీజేపీ ఆధ్వర్యంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. పలమనేరు ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించిన కమిషనర్ విజయశేఖర్ - ఒంటరిగా కనిపించిన బాలుడి ని గుర్తించి తల్లి దండ్రులకు సురక్షితం గా అప్ప గించిన పోలీసులు సాయి కిషోర్ విద్యార్థుల ప్రతిభ.. కామర్స్ కార్నివాల్‌లో విజయం పత్తి రైతులను ఆదుకోండి - క్వింటాకి రూ 12,000-00 లు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి - టి డీ పీ రాష్ట్ర నాయకులు కొలను వేణుగోపాల్ రెడ్డి

ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

                                      కార్మికులు, ప్రజల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపు

నిజాంపేట్ మేజర్ న్యూస్ నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని నిజాంపేట్ వార్డు కార్యాలయం వద్ద ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఏఐటీయూసీ నిజాంపేట్ సర్కిల్ మున్సిపల్ సంఘం అధ్యక్షుడు మేకల బాలకృష్ణ, కార్యదర్శి ఆశి యాదయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆశి యాదయ్య ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పాలభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘంగా ఏఐటీయూసీ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలోనూ కార్మికుల హక్కుల సాధనలోనూ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. 1920 అక్టోబర్ 31న లాలా లజపతిరాయ్ అధ్యక్షతన ఏఐటీయూసీ ఆవిర్భవించిందని, అప్పటి నుంచి అనేక కార్మిక పోరాటాలు నిర్వహిస్తూ సుమారు 44 కార్మిక చట్టాల సాధనలో కీలక పాత్ర పోషించిందని వివరించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను బలహీనపరిచే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛ, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు, మత, భాషా వైవిధ్యాలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగం, ఉద్యోగాల కోత, నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యా, వైద్య రంగాలకు బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రజా ఆస్తులను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. కార్మికుల హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్‌ల అమలుతో కార్మిక సంఘాల హక్కులకు విఘాతం కలుగుతోందని అన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించకుండా వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారని విమర్శించారు. కార్మిక, రైతు సంఘాల అభ్యంతరాలను పట్టించుకోకుండా ప్రజలకు నష్టం కలిగించే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ప్రభుత్వం ముందుకు తీసుకువస్తోందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 'రాజ్యాంగాన్ని రక్షించండి.. ప్రజలను కాపాడండి.. దేశాన్ని రక్షించండి' అనే నినాదంతో ప్రజలందరూ ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నిజాంపేట్ సర్కిల్ కన్వీనర్ పొన్నకంటి దస్తగిరి, నర్సింహా, మల్లయ్య, లక్ష్మీనారాయణ, నాగలక్ష్మి, భాగ్యమ్మ, నర్సమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.