ఓట్ బచావో – దేశ్ బచావో’ నిరసనకు కూన శ్రీశైలం గౌడ్ ఢిల్లీ పయనం*
జీడిమెట్ల మేజర్ న్యూస్ ఏఐసీసీ పిలుపు మేరకు నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ శనివారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ పర్యటన చేపట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడటం, ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. కూన శ్రీశైలం గౌడ్‌తో పాటు కార్పొరేషన్ చైర్మన్లు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మెట్టు సాయి కుమార్, గడ్డి అన్నారం మార్కెట్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తదితరులు ఢిల్లీకి బయలుదేరారు.