BREAKING
నేటి రాశి ఫలాలు –2 నవంబర్, 2026 నేటి పంచాంగం 2 నవంబర్, 2026 బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జమ్మికుంట వయా టేకుమట్ల గిద్ద ముత్తారం బస్సు సర్వీసు ప్రారంభం బస్సు సౌకర్యం ప్రారంభం భూమి వివాదంలో దాడి-కేసు నమోదు ఘనంగా కొనసాగుతున్న పుష్కర బ్రహ్మోత్సవాలు రవితేజపై వడ్డే నవీన్ సంచలన వ్యాఖ్యలు.. అప్పుడు సైడ్ రోల్స్ చేశాడంటూ ఆసక్తికర నిజాలు కాంగ్రెస్ నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపం! మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం నయనతార 'మహాశక్తి' మూవీ ట్రైలర్ ట్రోల్స్.. ఏఐ విజువల్స్ వివాదంపై సుందర్ సి క్లారిటీ దీపావళి బాణాసంచా విక్రయదారులు నిబంధనలు పాటించాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై క్రష్.. నటి సుధా ఆసక్తికర వ్యాఖ్యలు దొడ్డు బియ్యం మాటున సన్న బియ్యం! అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మద

నేడు నరసాపురం , ఆకివీడుల లో ఎన్నికల పోలింగ్*--ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా సద్వినియోగం చేసుకోవాలి* *--జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి*

Select Suryaa Now
నేడు నరసాపురం , ఆకివీడుల లో  ఎన్నికల పోలింగ్*--ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా సద్వినియోగం చేసుకోవాలి*  *--జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి*

నరసాపురం, మేజర్ న్యూస్ :జిల్లాలోని నరసాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 2026 నవంబర్ 1వ తేదీ ఆదివారం పోలింగ్ ఆయా మున్సిపాలిటీలు పరిధిలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజలందరూ ప్రజాస్వామ్య స్ఫూర్తితో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, పట్టణాల అభివృద్ధికి, సమర్థవంతమైన స్థానిక పాలనకు సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రతి ఓటరు భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు. 

అర్హత కలిగిన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటు వేయాలని కోరారు.

ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.

ఓటర్లు ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ, తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.