BREAKING
తల్లి శ్రీదేవి ‘నజినా’ గెటప్‌లో జాన్వి కపూర్: హ్యలోవీన్ వేడుకల్లో అద్భుతమైన ట్రిబ్యూట్ నేడు నరసాపురం , ఆకివీడుల లో ఎన్నికల పోలింగ్*--ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా సద్వినియోగం చేసుకోవాలి* *--జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి* గొల్లలవలసలో జోరుగా ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం: పాల్గొన్న యువ నాయకులు డాక్టర్ కృష్ణ చైతన్య ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విద్యుత్ సబ్‌స్టేషన్‌ పరిశీలించి, తుఫాను బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ ఓట్ బచావో – దేశ్ బచావో’ నిరసనకు కూన శ్రీశైలం గౌడ్ ఢిల్లీ పయనం* డైట్ లో ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవం. మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ భద్రత - 144 సెక్షన్ అమలు. ఐసీసీ టెస్టుర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ పీఠాన్ని కైవసం చేసుకున్న సౌతాఫ్రికా: ఆస్ట్రేలియాకు గట్టి షాక్‌ పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు భద్రత కరువు – గోపిక లక్ష్మిపై దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన ఏఐఎస్ఎఫ్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి…ఇందిరాగాంధీ వర్ధంతి ట్రైసిరీస్ ఫైనల్: సెంచరీతో చెలరేగిన కమిందు మెండిస్.. పాకిస్థాన్ ముందు భారీ లక్ష్యం సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో వెస్టిండీస్ ఘనవిజయం: బ్రాండన్ కింగ్ అద్భుత ఇన్నింగ్స్

*మోడల్ స్కూల్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి*

Select Suryaa Now
*మోడల్ స్కూల్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి*

జిన్నారం;తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, హెచ్ బి టి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెస్ జాక్  ఆధ్వర్యంలో శుక్రవారం బొల్లారం డివిజన్ పరిధిలోని తెలంగాణ మోడల్ స్కూల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిర్వహించిన ఈ నిరసనలో మోడల్ స్కూల్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి తమ ఆవేదనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెస్ జాక్  నాయకులు మాట్లాడుతూ.. మోడల్ స్కూల్స్‌లో విధులు నిర్వహిస్తున్న  పిజిటి, టిజిటి  ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, హెచ్ బి టి ఉపాధ్యాయులు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా సమస్యల పరిష్కారం కోసం విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రావడం లేదని పేర్కొన్నారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలైన పాఠశాలల విలీనం, కారుణ్య నియామకాలు, టీజీటీ లకు నోషనల్ ప్రయోజనాలు,  ఈ హెచ్ ఎస్ సౌకర్యం, ప్రమోషన్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్ బి టి ఉపాధ్యాయుల జీతాలు పెంచి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏలు, ఇతర బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్ ఉద్యోగులందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే స్పందించి, పెండింగ్ సమస్యలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని నాయకులు కోరారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఐక్యంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ టీచర్స్ యూనియన్ నాయకులు కొండయ్య, విఠల్, ప్రిన్సిపాల్ శ్రీదేవి, ఉపాధ్యాయులు మొహిద్దీన్, రవీందర్ రెడ్డి, శ్రీకాంత్, స్వప్న, ఉష, సుజాత, నాగరాజు, సూర్యనాయక్, పుష్ప, లక్ష్మీకాంత్ రెడ్డి, యూనస్, రాజేష్, వందన తదితరులు పాల్గొన్నారు.