BREAKING
నేటి రాశి ఫలాలు –2 నవంబర్, 2026 నేటి పంచాంగం 2 నవంబర్, 2026 బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జమ్మికుంట వయా టేకుమట్ల గిద్ద ముత్తారం బస్సు సర్వీసు ప్రారంభం బస్సు సౌకర్యం ప్రారంభం భూమి వివాదంలో దాడి-కేసు నమోదు ఘనంగా కొనసాగుతున్న పుష్కర బ్రహ్మోత్సవాలు రవితేజపై వడ్డే నవీన్ సంచలన వ్యాఖ్యలు.. అప్పుడు సైడ్ రోల్స్ చేశాడంటూ ఆసక్తికర నిజాలు కాంగ్రెస్ నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపం! మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం నయనతార 'మహాశక్తి' మూవీ ట్రైలర్ ట్రోల్స్.. ఏఐ విజువల్స్ వివాదంపై సుందర్ సి క్లారిటీ దీపావళి బాణాసంచా విక్రయదారులు నిబంధనలు పాటించాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై క్రష్.. నటి సుధా ఆసక్తికర వ్యాఖ్యలు దొడ్డు బియ్యం మాటున సన్న బియ్యం! అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మద

మియాపూర్ అభివృద్ధికి రూ.13.82 కోట్ల నిధులతో పలు కాలనీల్లో పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

Select Suryaa Now
మియాపూర్ అభివృద్ధికి రూ.13.82 కోట్ల నిధులతో పలు కాలనీల్లో పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే  ఆరెకపూడి గాంధీ

మియాపూర్,మేజర్ న్యూస్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో రూ.13.82 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే  అరెకపూడి గాంధీ శనివారం మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి బీకే ఎన్‌క్లేవ్, మయూరి నగర్, నడిగడ్డ తండా, ఎస్ఎంఆర్ హైలాండ్, శ్రీల గార్డెన్, శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలో సీసీ రోడ్లు, బీటీ రోడ్డు, వరద నీటి కాల్వలు, ఫుట్‌పాత్‌లు, పైప్‌లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా  రూ. 3 కోట్ల 06 లక్షల  రూపాయలతో కొండాపూర్  డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి  బ్లాక్, మార్తాండ్ నగర్, గోల్డెన్ తులిప్, మాధవ హిల్స్ ఫేజ్ 1  కాలనీలలో మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే  గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్గదర్శకత్వంలో, మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వరద నీటి కాల్వల నిర్మాణాన్ని వేగవంతం చేసి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కాలనీల్లో పార్కులను సుందరంగా అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళలు, కాలనీవాసులు పాల్గొన్నారు.