శ్రీదేవి థియేటర్ రోడ్డు విస్తరణ పనులను పర్యవేక్షించిన డిసి శ్రీనివాస్
మియాపూర్,మేజర్ న్యూస్ : ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రహదారుల విస్తరణ పనులు చేపట్టింది. మియాపూర్ సర్కిల్ పరిధిలోని శ్రీదేవి థియేటర్ జంక్షన్, అమీన్‌పూర్ రోడ్డులో ఈ పనులు కొనసాగుతున్నాయి.పనుల అమలులో భాగంగా డిప్యూటీ కమిషనర్, ఏసీపీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (DYEE), ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్ విభాగాల అధికారులు, పోలీసు శాఖ సిబ్బంది సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తూ పనులు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు.పనులు జరుగుతున్న సమయంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు శాఖ సహకారం అందిస్తోంది. మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనుల అమలును పర్యవేక్షిస్తున్నారు. రహదారుల విస్తరణతో ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కలగనున్నాయి.