గొట్టివలస ఎంపిటిసి అభ్యర్థి సంధ్య విస్తృత ప్రచారం
గరుగుబిల్లి, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల ప్రచా రంలో భాగంగా మండల పరిధిలోని గొట్టివలస ఎంపీటీసీ అభ్యర్థి వెలమల సంధ్య శుక్రవారం మరుపెంట పంచా యతీ పరిధిలోని గ్రామాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల తో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించా రు.గెలుపే లక్ష్యంగా గ్రామంలో వైయ స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం వైసిపి ఎంపీటీసీ అభ్యర్థి వెలమల సంధ్య మరుపెంట, సాంబన్నవలస,తులసిరామినాయు డువలస గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈసందర్భంగా ఎంపిటిసి అభ్యర్థి వెలమల సంధ్య మాట్లాడుతూ పల్లెల అభివృద్ధి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు.గత వైసిపి ప్రభుత్వ హయాంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు,అవినీతి రహిత పాలనే ఈఎన్నికల్లో తమను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని తెలిపారు.నవరత్నాలు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పేద కుటుం బానికి లబ్ధి చేకూరిందని సంక్షేమము మరియు అభివృద్ధి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బోను సుధ,దొగ్గ ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు.