BREAKING
గ్రామాల అభివృద్ధికి అడ్డుపడ్డారు.. ఓటుతో బదులివ్వండి ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు పోలీసుల రక్తదాన శిబిరంలో ఉత్సాహంగా పాల్గొన్న యువత *నిజాయితీ చాటుకున్న విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగి ప్రశాంత్* *పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను పోలీసుల సమక్షంలో బాధితుడికి అప్పగింత* విద్యార్థుల కళా ప్రతిభకు "సాధన 2026"వేదిక అక్టోబర్ 31 నుంచి మౌలానా ఆజాద్ జయంతి ఉత్సవాలు. : విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు. పలు పంటలను క్షేత్ర సందర్శనలో పరిశీలన. శాస్త్రవేత్తలు పసల కుటుంబానికి న్యాయం చేయాలి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల భద్రతపై బాపట్ల సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ జిఎంఆర్ కుటుంబ వేడుకకు ప్రముఖుల హాజరు చిలకలూరిపేటలో ఎన్నికల ప్రచారానికి తెర.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ రాజకీయాల కతీతమైన సంక్షేమ, అభివృద్ధి వైఎస్ఆర్సిపి తోనే సాద్యం *సంగారెడ్డి జిల్లా టి ఆర్ ఏ అధ్యక్షుడిగా పుట్టి సాయిలు నియామకం* జీన్ హెన్రీ డ్యూనాంట్‌కు రెడ్ క్రాస్ ఘన నివాళి

28వ వార్డు తేనెబండలో ఘన విజయమే లక్ష్యం - మేయర్ గా హేమలతకు భారీ మెజారిటీ - విజయాన్ని ఎమ్మెల్యే జగన్ మోహన్ కు కానుకగా అందిస్తాం - కార్పొరేటర్, తేజశ్రీ పచ్చప్ప

Select Suryaa Now
28వ వార్డు తేనెబండలో  ఘన విజయమే లక్ష్యం - మేయర్ గా హేమలతకు భారీ మెజారిటీ  - విజయాన్ని ఎమ్మెల్యే జగన్ మోహన్ కు కానుకగా అందిస్తాం  - కార్పొరేటర్, తేజశ్రీ పచ్చప్ప

చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్: 
చిత్తూరు నగరంలోని  28వ వార్డు.   తేన బండలో టీడీపీ మేయర్ అభ్యర్థి కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని కార్పొరేటర్ తేజశ్రీ పచ్చప్ప, తెలిపారు. ఆ విజయాన్ని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కు కానుకగా అందిస్తామని స్పష్టం చేశారు.
చిత్తూరు నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నాయకత్వం, ఆశీస్సులు, మార్గదర్శకత్వంలో 28వ వార్డు విజయం కోసం పని చేస్తున్నామని కార్పొరేటర్ తేజశ్రీ పచ్చప్ప, తెలిపారు.నగరంలోని 60 డివిజన్లలో 28వ వార్డు తేనబండ అత్యంత కీలకమైనవిగా భావిస్తూ అత్యధిక మెజారిటీ సాధించేందుకు సమష్టిగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తను కలుపుకుంటూ పార్టీ నాయకులు, యువత, స్థానిక ప్రజల సహకారంతో ప్రచారాన్ని బలోపేతం చేస్తూ ప్రజల మద్దతు కూడగడుతున్నామని తెలిపారు.ఎమ్మెల్యే తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆయన నాయకత్వంలో చిత్తూరు నగరం మరింత అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తున్నారని తెలిపారు. మేయర్ అభ్యర్థి కటారి హేమలతకు భారీ మెజారిటీతో విజయం సాధించి ఆ విజయాన్ని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కు కానుకగా అందిస్తామని కార్పొరేటర్ తేజశ్రీ పచ్చప్ప స్పష్టం చేశారు.ఈ ప్రచారంలో తెదేపా ప్రధాన కార్యదర్శి పచ్చప్పతో పాటు 28వ వార్డు నాయకులు అశోక్, రాజు, మూర్తి, వార్డు, టిడిపి కార్యకర్తలు,మహిళలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చిత్తూరు అర్బన్ రిపోర్టర్,  లవకుమార్