నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి * ముగిసిన చివరి ప్రచారంలో బుడుమూరి *
ఆరిలోవ, సూర్య : జీవీఎంసీ, 17వ వార్డు కార్పొరేటర్ టిడిపి అభ్యర్థి బుడుమూరి గోవింద్ శుక్రవారం ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో కూటమి నాయకులతో కలిసి వార్డు పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. గెలిచిన వెంటనే ప్రజల సమస్యలే లక్ష్యంగా వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.