చివరి రోజు ప్రచారంలో షణ్ముగం మనవళ్ల జోరు - కార్పొరేటర్ చందు మేనల్లుళ్లుగా ప్రచారంలో సందడి - 52వ డివిజన్ లో సాయి సంతోష్, సాయి భార్గవ్ విస్తృత ప్రచారం - హేమలత గెలుపే లక్ష్యంగా ముందడుగు
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:
చిత్తూరు నగర మేయర్ ఎన్నికల ప్రచారం చివరి రోజున 52వ డివిజన్ లో టీడీపీ యువత జోరు చూపించింది. చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు రాష్ట్ర టీడీపీ సీనియర్ నాయకులు పి. షణ్ముగం మనవళ్లు, కార్పొరేటర్ చందు మేనల్లుళ్లైన సాయి సంతోష్, సాయి భార్గవ్ ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
దివంగత టీడీపీ పార్లమెంటరీ మహిళా కార్యదర్శి దుర్గ కుమారులు, 52వ డివిజన్ కార్పొరేటర్ పి.ఎస్. చందుకు మేనల్లుళ్లు కావడం విశేషం. పవార్ చివరి రోజున డివిజన్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన సాయి సంతోష్, సాయి భార్గవ్ చిత్తూరు నగర కూటమి మేయర్ అభ్యర్థి కటారి హేమలతకు మద్దతుగా ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.
ఇంటింటికీ వెళ్లి స్థానికులతో మమేకమవుతూ కూటమి అభివృద్ధికి సహకరించాలని కోరారు. నగర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన పాలన అందించాలనే లక్ష్యంతో కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేటర్ చందు మేనల్లుళ్లుగా ప్రచారంలో పాల్గొనడం స్థానికంగా ఆకర్షణగా నిలిచింది.
టీడీపీ సీనియర్ నాయకుడు పి. షణ్ముగం కుటుంబానికి చెందిన యువకులు ఎన్నికల ప్రచారంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. యువతను కలుపుకొని ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తూ హేమలత విజయానికి తమ వంతు కృషి చేశారు.
52వ డివిజన్ లో గత రెండున్నరేళ్లలో 45 లక్షలతో అభివృద్ధి పనులు జరిగాయని, హేమలత గెలిస్తే మరింత 8అభివృద్ధి జరుగుతుందని యువ నేతలు తెలిపారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే జగన్ మోహన్ నాయకత్వంలోనే నగర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. చివరి రోజు ప్రచారంలో యువత ఉత్సాహంగా పాల్గొంది.
53వ డివిజన్ లో కూటమి హోరు - షర్మిల, హేమలత గెలుపు తథ్యం - యువ కార్పొరేటర్ చందు ప్రచారం జోరు.
ఈ ప్రచారంలో , 52వ డివిజన్ లో మాజీ కార్పొరేటర్లు కందా, గణేష్, కుప్పన్, పార్టీ నాయకులు జ్యోత్స్న, సూరి, మణి, వెంకటేష్, టీడీపీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్