తెలంగాణ జానపద గాయకులకు పూర్తి మద్దతు: డా. చీకోటి ప్రవీణ్ కుమార్
హైదరాబాద్: తెలంగాణ మట్టి వాసనను, సంస్కృతిని తమ పాటలతో ప్రపంచవ్యాప్తంగా చాటిచెబుతున్న జానపద గాయకులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వారికి తన సంపూర్ణ ప్రోత్సాహం , సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ధర్మ రక్ష స్థాపకులు డా. చీకోటి ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. రాబోయే "తెలంగాణ జనపద జానపద జైత్రయాత్ర 2026" రౌండ్ టేబుల్ సమావేశం, వేడుకలకు సంబంధించిన ముందస్తు ఆహ్వానాన్ని డా. చీకోటి ప్రవీణ్ కుమార్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ పాటలకు జీవం పోస్తున్న జానపద కళాకారుల సేవలను అభినందించారు. తెలంగాణ జానపద కళారంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, కళాకారుల ప్రతిభకు తగిన గుర్తింపు లభించేలా చూసేందుకు నగరంలో త్వరలోనే తెలంగాణ జానపద గాయకులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఒక భారీ బహిరంగ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ప్రవీణ్ కుమార్ హామీతో జానపద కళాకారులు, గాయకుల్లో నూతన ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో సైదాబాద్ శ్రీ విజయ వినాయక స్వామి ఆలయ ఛైర్మన్ హోదాలో, బీజేపీ నాయకుడిగా ఆయనతో పాటు పలువురు ముఖ్య నాయకులు, జానపద కళాకారుల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.