తాడిపత్రిలో సైకిల్ గుర్తుకు ఓటేయాలని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి విస్తృత ప్రచారం
అనంతపురం కలెక్టరేట్ రిపోర్టర్ వేణుగోపాల్..
తాడిపత్రిలో సైకిల్ గుర్తుకు ఓటేయాలని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి విస్తృత ప్రచారం!
చివరి రోజు ప్రచారంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రజలకు విజ్ఞప్తి.తాడిపత్రి: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పట్టణంలో విస్తృతంగా పర్యటించారు.మెయిన్ బజార్, సీబీ రోడ్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.తాడిపత్రి పట్టణ అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.