BREAKING
ఎన్నికల విధులపై సిబ్బందికి దిశానిర్దేశం..!! హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో సంచలనం.. పాకిస్థాన్‌పై యూఏఈ సంచలన విజయం! పహాడిషరీఫ్ డివిజన్ బీసీలకు కేటాయించాలి పాఠశాలలో మద్యం సీసాలను పగలగొడుతున్న వైనం బంగారం పై రుణాలు అందించిన రౌతు నాగరాజు మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలే నా అసలు సిసలు గుర్తింపు.. సీనియర్ నటి జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు! బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొని వ్యక్తి మృతి టిడిపి అభ్యర్థులను గెలిపించాలంటూ ఇంటింటికీ ప్రచారం జోటా హెల్త్‌కేర్ క్యూ2 సమీక్ష: టార్గెట్ ప్రైస్‌ను తగ్గించినప్పటికీ 'బై' రేటింగ్ కొనసాగించిన నిర్మల్ బాంగ్.. పూర్తి వివరాలు ఇవే! పోస్టల్ బ్యాలెట్ కు విశేష స్పందన గోద్రేజ్ కన్స్యూమర్‌కు 25% అప్‌సైడ్: బ్రోకరేజ్ సవరించిన టార్గెట్ ధరలు వెంకటాపూర్‌–తెనుగూడ ప్రజలకు నీలిమ ఆస్పత్రి ఉచిత వైద్య సేవలు.. పల్లా దంపతుల చిత్రపటాలకు క్షీరాభిషేకం బ్రహ్మసముద్రంలో ప్రచారంలో దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీ. వాట్సాప్ గ్రూప్ చాట్లలో కొత్త ఫీచర్లు.. ఇక మెసేజ్‌లను ఈజీగా క్యాచ్-అప్ చేసుకోవచ్చు, ఎలా పనిచేస్తాయంటే! ప్రముఖ హాలీవుడ్ నటుడు పాట్రిక్ స్టీవ్‌వర్ట్ కన్నుమూత.. విషాదంలో సినీ లోకం!

సైకిల్ గుర్తుకు ఓటెయ్యండి.

Select Suryaa Now
సైకిల్ గుర్తుకు ఓటెయ్యండి.
సైకిల్ గుర్తుకు ఓటెయ్యండి - తెలుగుదేశం నేత
డా.యం.ఉమేష్ రావు, 
   శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న ఎన్డీయే కూటమి బలపరచిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తొట్టంబేడు మండల అధ్యక్షుడు రావిళ్ళ మునిరాజా నాయుడుకి మద్దతుగా నిలిచి, తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై ముద్రించి అఖండ విజయాన్ని చేకూర్చమని కోరుతూ తెలుగుదేశం పార్టీ, బిజెపి, జనసేన పార్టీలకు చెందిన నాయకులు ఈరోజు తొట్టంబేడు యంపిటీసీ సెగ్మెంట్ పరిధిలోని తొట్టంబేడు మరియు సాంబయ్య పాలెం ప్రచారం నిర్వహించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ఎన్డీయే కూటమికి స్థానిక సంస్థల ఎన్నికలలో సంపూర్ణ విజయాన్ని అందించాలని కోరారు. గత ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో ఎక్కడా వెనుకడుగు వేయకుండా... పేదలకు పెన్షన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, రైతులకు పెట్టుబడి సాయం.. ఇలా ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా తీర్చి దిద్దుతున్న ఎన్డీయే కూటమి పాలనకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారని కొనియాడారు. 
 
గత వైసిపి ప్రభుత్వం అవలంబించిన దగాకోరు పారిశ్రామిక విధానం కారణంగా యువతకు సరైన ఉపాధి అవకాశాలు దొరక్క, వ్యసనాలకు బానిసలైన యువతరాన్ని నేరాల వైపు మళ్ళించి వారి బంగారు భవిష్యత్తును అంధకారం లోకి నెట్టేసిన జగన్ రెడ్డి యొక్క దుష్ట పరిపాలన నుండి బయట పడిన యువత భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తూ, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చి 20,00,000 లక్షల ఉద్యోగాల కల్పనలో జెట్ స్పీడుతో ముందుకు వెళుతున్న ఎన్డీయే కూటమి యొక్క అభ్యర్ధులనే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం కంకణబద్ధులై ఉన్నారని తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డా.జి.దశరథాచారి, గాలి చలపతి నాయుడు, మిన్నల్ రవి, డా.యం. ఉమేష్ రావు, బీమాల భాస్కర్, వజ్రం కిషోర్, చిల్లకూరు ఆనందమ్మ, డి.వి.నారాయణ, చిల్లకూరు మణి, వెంకటేశ్వర్లు, సుబ్బయ్య, పోలూరు శ్రీనివాసులు రెడ్డి, మునిరాజా యాదవ్, కె.వి.ప్రతాప్, సయ్యద్ చాంద్ బాషా, మునెయ్య, కరీం, మురళి, మునిరాజా, శేఖర్, శంకరయ్య, చందు, ముని, శివ, భువన కుమార్, యం.యస్.రెడ్డి, వెంకట్ రెడ్డి, మునిచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి