BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

చివరి రోజు మిన్నంటిన కూటమి ప్రచార హోరు.. ప్రచారంలో కేంద్ర మంత్రి తోఖన్ సాహు, మాధవ్ సహా కీలక నేతలు.. ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో భారీ రోడ్ షో.. కూటమి ర్యాలీకి పోటెత్తిన జనసందోహం.. 3పార్టీల్లో జోష్ మేయర్ అభ్యర్థి ఇస్తున్న ప్రతి హామీకి నాది బాధ్యత.. కేంద్ర మంత్రి తోఖన్ సాహు అండర్ గ్రౌండ్ డ్రైనేజ

Select Suryaa Now
చివరి రోజు మిన్నంటిన కూటమి ప్రచార హోరు..  ప్రచారంలో కేంద్ర మంత్రి తోఖన్ సాహు, మాధవ్ సహా కీలక నేతలు..  ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో భారీ రోడ్ షో.. కూటమి ర్యాలీకి పోటెత్తిన జనసందోహం.. 3పార్టీల్లో జోష్  మేయర్ అభ్యర్థి ఇస్తున్న ప్రతి హామీకి నాది బాధ్యత.. కేంద్ర మంత్రి తోఖన్ సాహు  అండర్ గ్రౌండ్ డ్రైనేజ

అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్:-  అనంతపురం నగరంలో చివరి రోజు కూటమి పార్టీల మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తింది. కూటమి అభ్యర్థుల తరుఫున హేమా హేమీలు రంగంలోకి దిగి ప్రచారాలు నిర్వహించారు. శుక్రవారం జరిగిన ప్రచారంలో కేంద్ర సహాయ మంత్రి తోఖన్ సాహు, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, పీవీఎన్ మాధవ్,ఎంపీ అంబికా, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ప్రముఖ నటుడు బాబు మోహన్ పాల్గొన్నారు. నగరంలో టవర్ క్లాక్ నుండి గాంధీ బజార్ వరకు వందలాది బైక్‌లతో భారీ రోడ్ షో నిర్వహించారు. నగర రహదారులన్నీ జనసందోహంతో పూర్తిగా స్తంభించిపోయాయి. తాడిపత్రి బస్టాండ్ గాంధీ సర్కిల్ బహిరంగ సభకు కూటమి మూడు పార్టీల శ్రేణులు వేలాదిగా తరలివచ్చారు. సభలో కేంద్ర మంత్రి తోఖన్ సాహు మాట్లాడుతూ.. బీజేపీ మేయర్ అభ్యర్థి కె. అజేష్ బాబును ఆశీర్వదించడానికి తాను స్వయంగా ఢిల్లీ నుండి వచ్చానని చెప్పారు. అజేష్ బాబు నగర ప్రజలకు ఇస్తున్న ప్రతి హామీని నెరవేర్చే పూర్తి బాధ్యతను ప్రధాని నరేంద్ర మోడీ ప్రతినిధిగా తాను తీసుకుంటున్నానని భరోసా ఇచ్చారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు-పవన్ లతో పాటు ఇక్కడ నగరంలో మేయర్‌ను గెలిపిస్తేనే ‘త్రిబుల్ ఇంజన్ సర్కార్’ బలం అందుతుందని, తద్వారా పట్టణాల అభివృద్ధి రాకెట్ వేగంతో సాగుతుందని స్పష్టం చేశారు. అనంతపురం దశాబ్దాల కల అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ డిపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలించిందని, దీనిని కచ్చితంగా పూర్తి స్థాయిలో మంజూరు చేయిస్తామని ప్రకటించారు. నగరంలోని ప్రధాన సమస్య అయిన డంపింగ్ యార్డును ఇక్కడి నుండి పూర్తిగా తొలగించి, వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌తో శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. నగర సమగ్ర ప్రగతి కోసం 16వ ఆర్థిక సంఘం నిధులను పెద్ద ఎత్తున అనంతపురానికి తీసుకొస్తానని, స్వచ్ఛమైన, సుందరమైన అనంతపురంగా తీర్చిదిద్దుతామని తోఖన్ సాహు  హామీ ఇచ్చారు. ప్రముఖ నటుడు బాబు మోహన్ మాట్లాడుతూ ఓటు అనేది ఎంతో విలువైనదని, ప్రజలెవరూ తమ అమూల్యమైన ఓటును అమ్ముకోవద్దని, వృథా చేసుకోవద్దని పిలుపునిచ్చారు. తాను ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో, నటుడిగా హాస్యాన్ని పండించి జనాన్ని నవ్వించాను తప్ప ప్రజలను ఎప్పుడూ మోసం చేయలేదన్నారు. బీజేపీ వైపు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల అండ ఉందని, మరి ఒంటరిగా మిగిలిపోయిన వైసిపి వైపు ఎవరున్నారని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంతోనే దేశం, రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని, ఓటర్లంతా ఆలోచించి కూటమికి పట్టం కట్టాలని కోరారు.   *అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ..* కూటమి ప్రచారానికి ప్రజల నుండి వస్తున్న అపూర్వ స్పందన చూస్తుంటే కూటమి చారిత్రాత్మక విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత రెండున్నరేళ్ల కూటమి పాలనలో అనంతపురం నగరంలో రూ. 350 కోట్లతో రికార్డు స్థాయిలో రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతులు కల్పించి, గత 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించామన్నారు. గత వైసిపి ప్రభుత్వం చేసిన రూ. 10 లక్షల కోట్ల అపారమైన అప్పుల వల్లే గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని మండిపడ్డారు. ప్రస్తుతం రూ. 107 కోట్ల కేంద్ర నిధులతో నగర తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కార ప్రాజెక్ట్ పనులు చేపట్టామని చెప్పారు. అమృత్ తాగునీటి పథకం ద్వారా ప్రతి ఇంటికీ సురక్షితమైన నీటిని సరఫరా చేస్తామని, అనంతసాగర్ చెరువుకట్టను వాకింగ్ ట్రాక్, లైటింగ్‌తో అద్భుతమైన ట్యాంక్ బండ్‌గా సుందరీకరిస్తామన్నారు. డంపింగ్ యార్డును తొలగించి అక్కడ ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్, నైట్ పార్కు తెస్తామని, ప్రతి ఇంటికీ పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ అందిస్తామని వివరించారు. నడిమి వంకతో పాటు ఇతర వంకలకు సైడ్ వాల్స్ నిర్మించి ముంపు సమస్యకు శాశ్వత చెక్ పెడతామన్నారు. నగరంలోని ప్రముఖ కూడళ్లలో పబ్లిక్ టాయిలెట్లతో పాటు, మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ టాయిలెట్లను, కాలుష్య నివారణ కోసం ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు నిర్మించి యువతకు ఉపాధి కల్పిస్తామని, నగర ప్రజల భాగస్వామ్యంతో ప్రత్యేక అభివృద్ధి కమిటీని వేసి పారదర్శక పాలన అందిస్తామన్నారు. బీజేపీ మేయర్ అభ్యర్థి కె. అజేష్ బాబు గెలిస్తే ఢిల్లీ చూపు నిరంతరం అనంతపురం వైపే ఉంటుందని, మేయర్ అభ్యర్థితో పాటు 62 స్థానాల్లో కూటమి అభ్యర్థులందరినీ గెలిపించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..