పహాడిషరీఫ్ డివిజన్ బీసీలకు కేటాయించాలి
*పహాడిషరీఫ్ డివిజన్ బీసీలకు కేటాయించాలి *మంత్రి పొన్నం ప్రభాకార్ కు వినతి పత్రం అందజేసిన కొండల్ యాదవ్.
మామిడిపల్లిలోని దివంగత గవర్నర్ పి. శివశంకర్ నివాసంకు వచ్చిన
తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని పహాడీషరీఫ్ మాజీ కౌన్సిలర్ పందెం కొండల్ యాదవ్,పుంజాల శాశ్వత్ శంకర్ తో కలసి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో 64వ డివిజన్‌ను పహాడిషరీఫ్ ను బిసి కేటగిరీకి రిజర్వ్ చేయాలని కోరుతూ, మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఆ డివిజన్‌లో బిసి జనాభా అధికంగా ఉన్నందున వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వివరించారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన మంత్రి విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.