వెదురు కుప్పంలో టిడిపి ఇంటింటి ప్రచారం
వెదురుకుప్పం, మేజర్ న్యూస్: సంసాగత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎంపీటీసీ శైలజ బాలాజీ నాయుడు ఆధ్వర్యంలో నల్లవెంగనపల్లి ఎంపీటీసీ పరిధిలో ప్రచారాన్ని నిర్వహించారు. నల్ల వెంగనపల్లి ఎంపీటీసీ అభ్యర్థి వరప్రసాద్, జడ్పిటిసి అభ్యర్థి జ్యోతి లను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నల్ల వెంగనపల్లి మాజీ ఎంపీటీసీ శైలజ బాబు నాయుడు, తాటిమాకులపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు బాబు నాయుడు, మాజీ ఎంపీటీసీ నాదముని నాయుడు, టిడిపి సీనియర్ నాయకులు బి ఎం రవి, కుమార్, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు