BREAKING
రావివలస పంచాయతీ మాజీ సర్పంచ్ రమణ మృతి తలారి రంగయ్య ఆశీస్సులతో బ్రహ్మసముద్రం జడ్పిటిసి అభ్యర్థి ప్రచారంలో జోరు. నాగ్వారం గ్రామంలో విబిజిరాంజి పనుల పరిశీలన మూకుత్తి అమ్మన్ 2 పూజా కార్యక్రమానికి నయనతార గైర్హాజరు.. కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ! ఇండిగో షేర్లకు బ్రోకరేజ్ జోష్: 28% అప్‌సైడ్ టార్గెట్ నిర్దేశం నవల్గ అభివృద్ధికి రూ.57 లక్షలు.. 943 మందికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 28వ వార్డు తేనెబండలో ఘన విజయమే లక్ష్యం - మేయర్ గా హేమలతకు భారీ మెజారిటీ - విజయాన్ని ఎమ్మెల్యే జగన్ మోహన్ కు కానుకగా అందిస్తాం - కార్పొరేటర్, తేజశ్రీ పచ్చప్ప నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి * ముగిసిన చివరి ప్రచారంలో బుడుమూరి * విశ్వక్ సేన్ 'కల్ట్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా? వృద్ధి పథంలో అంబుజా సిమెంట్స్: సిస్టమాటిక్స్ లక్ష్య ధర ఎంతంటే? జడ్పిటిసి గా అవకాశం ఇస్తే అన్ని విధాల అభివృద్ధి.. కూటమి జెడ్పిటిసి అభ్య ర్థి జబ్బల మీన.. గొట్టివలస ఎంపిటిసి అభ్యర్థి సంధ్య విస్తృత ప్రచారం ముగిసిన కాకి గంగరాజు ప్రచార ర్యాలీ చివరి రోజు ప్రచారంలో షణ్ముగం మనవళ్ల జోరు - కార్పొరేటర్ చందు మేనల్లుళ్లుగా ప్రచారంలో సందడి - 52వ డివిజన్ లో సాయి సంతోష్, సాయి భార్గవ్ విస్తృత ప్రచారం - హేమలత గెలుపే లక్ష్యంగా ముందడుగు నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఐదో విడత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రత్యేక క్యాంపెయిన్!

దిబ్బనదొడ్డిలో టీడీపీ ప్రచారం తో స్వల్ప ఉద్రిక్తత

Select Suryaa Now
దిబ్బనదొడ్డిలో టీడీపీ ప్రచారం తో స్వల్ప ఉద్రిక్తత

 

మంత్రాలయం, సూర్య ప్రతినిధి స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రాలయం మండలంలోని రాంపురం, దిబ్బనదొడ్డి గ్రామాల్లో టీడీపీ ఇన్‌చార్జ్ రాఘవేంద్ర రెడ్డి, కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, జడ్పీటీసీ అభ్యర్థి ఆర్. లక్ష్మయ్యతో కలిసి శుక్రవారం పర్యటించారు.ముందుగా రాంపురం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామ చావిడి వద్ద ప్రచార రథంపై ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాంపురం గ్రామంలో సుమారు రూ.45 లక్షలతో వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. వీరేష్ ఇంటి నుంచి శ్మశానం వరకు, కొత్త రాంపురం నుంచి పాత రాంపురం వరకు, సీతారామిరెడ్డి ఇంటి నుంచి ఆర్ అండ్ బీ రోడ్డు వరకు, పీర్ల దావిడి నుంచి గ్రామ దావిడి వరకు, ఇతర వీధుల్లో రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. అలాగే జల్‌జీవన్ మిషన్ ద్వారా గ్రామానికి రూ.కోటి నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు.అనంతరం దిబ్బనదొడ్డి గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామానికి తారురోడ్డు వేయించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ అభ్యర్థి ఆర్. లక్ష్మయ్యను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. దింతో దిబ్బనదొడ్డిలో స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దిబ్బనదొడ్డి గ్రామంలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య మాటామాటా పెరగడంతో స్వల్ప ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తపై దాడికి పాల్పడినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో కొద్దిసేపు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

200 మంది పోలీసులతో భారీ బందోబస్తు

టీడీపీ ఇన్‌చార్జ్ రాఘవేంద్ర రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎమ్మిగనూరు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సీఐలు గిరిబాబు, రామాంజులు, మాధవరం ఎస్‌ఐలు విజయకుమార్, మల్లికార్జున, చిరంజీవి తదితరులు సుమారు 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పర్యటన ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

నాగరాజు మంత్రాలయం సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా