BREAKING
వైసీపీ అభ్యర్థులను గెలిపించాలి.. మరిశర్ల బాపూజీనాయుడు సైకిల్ గుర్తుకు ఓటెయ్యండి. శాతవాహన హైస్కూలులో మానసిక ఆరోగ్యంపై అవగాహన చేయూత పింఛన్లపై క్షేత్రస్థాయి పరిశీలన * జర్నలిస్టులపై దాడులు అమానుషం జలదిగ్బంధంలో ధూళిపూడి ... కష్టాల్లో 30 గృహాలు ఉత్తర నియోజకవర్గం 50 వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కె.కె రాజు తెలంగాణ జానపద గాయకులకు పూర్తి మద్దతు: డా. చీకోటి ప్రవీణ్ కుమార్ తాడిపత్రిలో సైకిల్ గుర్తుకు ఓటేయాలని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి విస్తృత ప్రచారం వ్యాపారస్థులంతా తూనికలు - కొలతల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. : దిబ్బనదొడ్డిలో టీడీపీ ప్రచారం తో స్వల్ప ఉద్రిక్తత బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ కవిత గారి నిర్ణయం అభినందనీయం – కడెం అర్చన వెదురు కుప్పంలో టిడిపి ఇంటింటి ప్రచారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన 'ఓరి నాయనో'.. క్లాప్ కొట్టిన ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి! గెలుపే లక్ష్యంగా ప్రచారంలో జెడ్పిటిసి అభ్యర్థి రెడ్డి పావని

అనంతపురం ప్రశాంతంగా ఉండాలంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించండి

Select Suryaa Now
అనంతపురం ప్రశాంతంగా ఉండాలంటే  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించండి

 

 

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : అనంతపురం నగరం ప్రశాంతంగా ఉండాలంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి కోరారు. మేయర్, కార్పొరేటర్‌ ఎన్నికల్లో వైసీపీ, సీపీఐ అభ్యర్థులకు ప్రజలు పట్టం కట్టాలని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు శుక్రవారం నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల హాస్టల్‌ వద్ద నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనంతపురంలో పరిస్థితి ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని కోరారు. మరోసారి పొరపాటు చేస్తే అనంతపురం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోతుందని అన్నారు. గత ఎన్నికల సమయంలో వైఎస్‌ జగన్‌ కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న పథకాలను కూడా నిలిపివేశారన్నారు. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చేశారని విమర్శించారు. జిల్లా కేంద్రమైన అనంతపురంలో దోపిడీపాలన సాగుతోందన్నారు. కూటమి నాయకులకు డబ్బులు ఇస్తేనే ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరుగుతున్నాయని అన్నారు. అనంతపురం మేయర్‌ అభ్యర్థి రమేష్‌ గౌడ్‌తో పాటు 60 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులను, 2 డివిజన్లలో సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ నిరంకుశంగా జరుగుతోందని మండిపడ్డారు. పోరాటాల అనంతపురంలో అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఆయన అనుచరులు సాగించిన అరాచకాలను ప్రజలు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. నగరంలో సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు ఎవరూ కూడా మనశ్శాంతిగా బతికే పరిస్థితి లేదన్నారు. ఇల్లు కట్టుకోవాలన్నా డబ్బులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని తెలిపారు. కూటమి అభ్యర్థులను గెలిపిస్తే ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండాపోతుందని అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీని గెలిపిస్తే ప్రశాంత అనంతపురంతో పాటు అవినీతిపరులు, దౌర్జన్యకారుల నుంచి రక్షణ కల్పిస్తామని తెలిపారు. ప్రజలను కాపాడుకుంటాం.. కాపలాదారులుగా ఉంటాం అని భరోసా ఇచ్చారు. మేయర్‌ ఎన్నికల్లో గెలవడానికి ఢిల్లీ నుంచి డబ్బు మూటలతో వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్నదమ్ముల్లా ఉన్న మన మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కూటమి అభ్యర్థులను గెలిపిస్తే అవినీతికి లైసెన్స్‌ ఇచ్చినట్టేనని అన్నారు. పోలింగ్‌ సమయంలో కూటమి నేతల దౌర్జన్యాలకు ఎవరూ భయపడొద్దని, కార్యకర్తలను తాకాలంటే ముందుగా తనను దాటాల్సి ఉంటుందన్నారు. పోలింగ్‌ నుంచి కౌంటింగ్‌ వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజలు ధైర్యంగా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.  వైసీపీ అనంతపురం పార్లమెంట్‌ పరిశీలకుడు నరేష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేసిన జగన్‌కు.. అపద్ధపు హామీలు, అరాచక పాలన సాగిస్తున్న చంద్రబాబుకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు  జోక్యంతో 19 చోట్ల మళ్లీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందంటే కూటమి నాయకులు ఎలాంటి కుట్రలు, అరాచకాలు చేశారో ప్రజలు గమనించాలన్నారు. అనంతపురం మేయర్‌గా రమేష్‌తో పాటు 62 డివిజన్లలో వైసీపీ, సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సీపీఐ రాష్ట్ర నేత జగదీష్‌ మాట్లాడుతూ.. వైసీపీ మేయర్‌ అభ్యర్థి రమేష్‌గౌడ్‌కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు. రమేష్‌ గౌడ్‌ గెలుస్తాడనే ఢిల్లీలో వణుకు మొదలైందని తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పథకాలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయినట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని దొడ్డిదారిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందరూ కలిసికట్టుగా ఎదుర్కొని రమేష్‌గౌడ్‌ను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ మేయర్‌ అభ్యర్థి రమేష్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ఏ ఇంటికి వెళ్లినా తాము గత ఎన్నికల్లో కూటమికి ఓటు వేసి తప్పుచేశామని చెబుతున్నారని తెలిపారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న అనంత వెంకటరామిరెడ్డి వంటి లీడర్‌ను పోగొట్టుకున్నామని బాధపడుతున్నారన్నారు. భూగర్భ విద్యుత్‌ కేబుల్, విమానాశ్రయం అంటూ కూటమి నేతలు అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని.. అనంతపురం ప్రజలకు మొదటగా ప్రశాంతత కావాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ గల్లీ నుంచి ఢిల్లీ వరకు లీడర్లను పిలిపించి షో చేస్తున్నారని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉండి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి విస్తరణ పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. అనంతపురంను అవినీతికి కేరాఫ్‌గా మార్చడానికే త్రిబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ కావాలని కూటమి నేతలు కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కుల, మతాల మధ్య చిచ్చుపెట్టడానికి వందలాది మందిని అనంతపురం తీసుకొచ్చారని తెలిపారు. ఢిల్లీ అహంకారానికి, అనంతపురం ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. వైసీపీ హయాంలో అనంతపురంలో రూ.1200 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తే.. కూటమి వచ్చాక విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాము అండగా ఉంటామని, తనను ఆశీర్వదించాలని కోరారు. అన్ని డివిజన్లలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.