గెలుపే లక్ష్యంగా ప్రచారంలో జెడ్పిటిసి అభ్యర్థి రెడ్డి పావని
గజపతినగరం, సూర్య : గజపతినగరం మండలం పాతబగ్గాం గ్రామంలో కూటమి అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రచారంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పాల్గొనగా జడ్పిటిసి అభ్యర్థి రెడ్డి పావని,ఎంపిటిసి అభ్యర్థి కర్రి బంగారునాయుడును పార్టీ విభేదాలు లేకుండా కూటమి అభ్యర్థులుగా గెలిపించుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కార్యకర్తలను, ప్రజలను కోరడం జరిగింది, రెడ్డి పావని కార్యకర్త నుంచి రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగిన మనిషి కల్మషం లేని మనిషిగా ఈరోజు కూటమి జెడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాతబగ్గాం గ్రామానికి సుమారు 70 లక్షలు సీసీ రోడ్లు , వాటర్ పైప్ లైన్ వేయడం జరిగింది అలాగే పాతబగ్గాం నుంచి సాలిపేట వరకు గ్రావెల్ రోడ్డు సేక్షన్ చేసాం ఎలక్షన్ తర్వాత పనులు ప్రారంభిస్తారు మన గ్రామ అభివృద్ధి జరగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించుకోండి అని ప్రజలకు చెప్పడం జరిగింది,మంత్రి శ్రీనివాస్ సభ ప్రాంగణంలో మన గ్రామ అభివృద్ధి జరగాలంటే కూటమి అభ్యర్థి అయిన కర్రి బంగారు నాయుడిని గెలిపించుకోండి అనగానే ప్రజలు జేజేలు కొట్టారు,ఈ కార్యక్రమంలో ఎంపీపీ అభ్యర్థి గంట్యాడ శ్రీదేవి ,ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, మాజీ జడ్పిటిసి గార తౌడు, జనసేన నాయకులు కడమల శ్రీను, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.