BREAKING
ఉగాండాలో మూడు సంవత్సరాల గరిష్టానికి ద్రవ్యోల్బణం ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన 14 సంస్థలపై చర్యలు - అదనపు కలెక్టర్ ఆర్.ఎస్ చిత్రు చేర్యాల సబ్‌రిజిస్టర్ కార్యాలయంలో పారిశుద్ధ్య పనులు కెనడా ఆర్థిక వ్యవస్థ ఆగస్టులో స్తంభించిన వృద్ధి *ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంచిన గ్రామ సర్పంచ్ బానోత్ లింగం నాయక్* భూభారతి రీ-సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం! సింగరేణి కార్మికుల హామీలపై సమాధానం చెప్పాలి - 12వ వేతన ఒప్పందంపై తేల్చకుంటే పోరుబాటే ఎన్నికల వేళ మద్యం దుకాణాలు బంద్! యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులో వడ్డీ రేట్ల పెంపు చర్చ అశ్వారావుపేటలో డ్రంకెన్ డ్రైవ్‌లపై కొరడా..-ఇద్దరికి జైలు, ఇద్దరికి జరిమానా* ఉద్యోగులకు 17 శాతం హెచ్‌ఆర్‌ఏ అమలుకు ప్రతిపాదనలు పంపిస్తాం - కలెక్టర్ చిత్రా మిశ్రా హామీ చైనా-యూరోపియన్ యూనియన్ సంబంధాలపై జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు సూర్య కథనానికి అధికారుల స్పందన అక్రమ నిర్మాణాల పనులు నిలిపివేయాలని ఆదేశం ఎన్నికల సంఘం, ఎస్‌ఐఆర్‌పై అసత్య ప్రచారం ఆపాలి విబిజి రామ్‌జీ పనులు సమర్థవంతంగా చేపట్టాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి,సీనియర్ సివిల్ జడ్జి గోపిక నాగ శ్రావ్య

Select Suryaa Now
చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి,సీనియర్ సివిల్ జడ్జి గోపిక నాగ శ్రావ్య

చట్టాల పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి గోపిక నాగ శ్రావ్య అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ నాగర్ కర్నూల్  ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిధిలోని శ్రీపురం గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  నందు సురక్షిత్ బచ్పన్ అభియాన్ -ఏ పాన్ ఇండియా స్కూల్ అవేర్నెస్ క్యాంపెయిన్ గురించి విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  సీనియర్ సివిల్ జడ్జి గోపిక నాగ శ్రావ్య  హాజరై మాట్లాడుతూ సురక్షిత్ బచ్‌పన్ అభియాన్ అనేది భారతదేశంలో పిల్లల రక్షణ, హక్కులు మరియు వారి భద్రతను పెంపొందించడం కోసం ఉద్దేశించిన ఒక ముఖ్యమైన కార్యక్రమం అన్నారు.  చిన్న పిల్లలపై జరిగే లైంగిక దాడులు, వేధింపులను అడ్డుకోవడం కోసం ఏర్పాటైన POCSO (పోక్సో) చట్టం పై పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉదేశ్యం అన్నారు. ప్రతి బిడ్డకు స్వేచ్ఛగా చదువుకునే, ఆడుకునే సురక్షితమైన వాతావరణాన్ని అందించడం. పాఠశాలల్లో విద్యార్థులకు గుడ్ టచ్ - బ్యాడ్ టచ్ గురించి వివరించడం జరుగుతుందన్నారు.  సందర్భంగా బాలల రక్షణకు సంబంధించిన పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో శ్రీరామ్ ఆర్య గవర్నమెంట్ లాయర్, సుదర్శన్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు , విద్యార్థులు పాల్గొన్నారు.

పి.వినయ్ కుమార్, నాగర్‌కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్