BREAKING
కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించండి – టీడీపీ ఇంచార్జ్ మనోజ్ రెడ్డి. నూతనకల్‌–శ్రీరంగవరం మధ్య నక్షా రోడ్డు ఏర్పాటు చేయాలి:తహసీల్దార్‌కు ప్రజాప్రతినిధుల వినతి డా.ఖలీల్ బాబు కు మహాత్మా గాంధీ స్మారక పురస్కారం ప్రదానం అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా చూడాలి..సైక్లోన్ ప్రత్యేక అధికారి మురళీధర రెడ్డి ఆదేశం బొగ్గు నాణ్యతకే అత్యంత ప్రాధాన్యత.. సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి.సూర్య నారాయణ బీసీలకు వెన్ను విరిచిన జగన్. నన్నూరులో కూటమి అభ్యర్థుల ముమ్మర ప్రచారం ఉచిత హోమియో వైద్య శిబిరం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో సంకట చతుర్ధ హోమం. కేసన హరి బాబును గెలిపించాలని గౌతమ్ ప్రచారం అండర్-19 ఆసియా కప్ జట్టు ప్రకటన.. రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్ కుమారులకు చోటు! వైసీపీ అభ్యర్థులను గెలిపించాలి.. మరిశర్ల బాపూజీనాయుడు సైకిల్ గుర్తుకు ఓటెయ్యండి. శాతవాహన హైస్కూలులో మానసిక ఆరోగ్యంపై అవగాహన చేయూత పింఛన్లపై క్షేత్రస్థాయి పరిశీలన

సింగరేణి కార్మికుల హామీలపై సమాధానం చెప్పాలి - 12వ వేతన ఒప్పందంపై తేల్చకుంటే పోరుబాటే

Select Suryaa Now
సింగరేణి కార్మికుల హామీలపై సమాధానం చెప్పాలి - 12వ వేతన ఒప్పందంపై తేల్చకుంటే పోరుబాటే
సూర్య నస్పూర్‌ : సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి విమర్శించారు. శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-5 గనిలో రాష్ట్ర కార్యదర్శి ఎస్. వెంకటస్వామి ఆధ్వర్యంలో, నేలబోయిన కుమారస్వామి నేతృత్వంలో యూనియన్‌లో నూతనంగా చేరిన యువ కార్మికులకు రాజారెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 12వ వేతన ఒప్పంద కమిటీపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిపై బీజేపీ నాయకులు ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. మూడు నెలలకోసారి పెరగాల్సిన డీఏను సకాలంలో పెంచడం లేదని, వేజ్‌బోర్డు వేతనాల పెంపుపైనా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డివిడెండ్ల రూపంలో నిధులు తీసుకోవడమే కాకుండా సీఎస్ఆర్, డీఎంఎఫ్టీ నిధులను తమకు అనుకూలమైన ప్రాంతాల్లో ఖర్చు చేస్తున్నాయని ఆరోపించారు. కార్మికులకు రావాల్సిన బకాయిలపై సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. జాబ్ మేళాల పేరుతో రాజకీయ జోక్యం చేసుకుంటూ అర్హులైన వారికి అపాయింట్‌మెంట్ లెటర్లు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని విమర్శించారు. కార్మికులకు నాణ్యమైన పనిముట్లు అందించడంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు విఫలమయ్యాయని అన్నారు. లాభాల వాటా పంపిణీ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించి డిపెండెంట్ ఉద్యోగులకు నియామక పత్రాలు అందించాలని కోరారు. కార్మికుల సొంతింటి కలను దీపావళిలోపు కార్యరూపంలోకి తీసుకురాకుంటే మరోసారి నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. మెడికల్ బోర్డును క్రమం తప్పకుండా నిర్వహించాలని, సీఎంపీఎఫ్ ఖాతాల్లో రికవరీ అయిన డబ్బుల వివరాలను పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని డిమాండ్ చేశారు. గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసినందున అన్ని యూనియన్లను యాజమాన్యం సమానంగా చూడాలన్నారు. కార్మికుల సమస్యలపై తక్షణమే స్పందించకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి ఇప్ప నరేష్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ చిగురు లక్ష్మణ్, బట్టు సురేందర్, పుప్పాల మహేష్, కె. ప్రభాకర్, సీహెచ్. కమల్ కుమార్, కె. వినయ్, జి. నరేష్ తదితరులు పాల్గొన్నారు.