telangana
నూతనకల్–శ్రీరంగవరం మధ్య నక్షా రోడ్డు ఏర్పాటు చేయాలి:తహసీల్దార్‌కు ప్రజాప్రతినిధుల వినతి
మేడ్చల్ మేజర్ న్యూస్:నూతనకల్ గ్రామం నుంచి శ్రీరంగవరం వరకు నక్షా రోడ్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఎల్లంపేట్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు మేడ్చల్ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. నూతనకల్ నుంచి శ్రీరంగవరం వరకు నక్షా రోడ్డు ఏర్పాటు చేస్తే పరిసర ప్రాంతాల రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ప్రస్తుతం వ్యవసాయ భూములకు రాకపోకలు సాగించడంతో పాటు పండించిన పంటలను తరలించేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే రైతులకు రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా వ్యవసాయ పనులకు కూడా ఎంతో వెసులుబాటు కలుగుతుందని పేర్కొన్నారు.రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నక్షా రోడ్డు ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తహసీల్దార్‌ను కోరారు. దీనిపై తహసీల్దార్ సానుకూలంగా స్పందించి, సమస్యను పరిశీలించి త్వరలోనే రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ప్రజాప్రతినిధులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి, కౌన్సిలర్లు చిన్నోళ భాస్కర్, ఓం ప్రకాష్, సద్ది సురేష్ రెడ్డి, వరలక్ష్మి సురేందర్, దాది నరసింహ, జిన్నారం కృష్ణ, జీడిపల్లి భూపాల్ ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.