బీసీలకు వెన్ను విరిచిన జగన్.
విశ్వాస ఘాతుకానికి నిలువెత్తు సాక్ష్యం గొడ్డలి పార్టీ.
టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యాను అఖండ మెజార్టీతో గెలిపించాలి. కృష్ణ బలిజ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశం వెంకటేశ్వరావు.
సూర్య న్యూస్ ముండ్లమూరు.
బీసీలను వెన్నుముక అని తీపి మాటలతో మభ్యపెట్టిన జగన్ అధికారంలోకి రాగానే పొట్టన పెట్టుకున్నారని స్థానిక సంస్థల రిజర్వేషన్లు 34 శాతం నుండి 24% తగ్గించి ఏకంగా 168 00కి రాజకీయ పదవులకు బీసీలను దూరం చేశారని కృష్ణ బలిజ సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశం వెంకటేశ్వరావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ముండ్లమూడి జడ్పిటిసి టిడిపి అభ్యర్థి మందలపు సౌమ్యను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. టిడిపి ఆవిర్భావం నుంచి బీసీలకు వెన్నుముకగా నిలిచిన పార్టీ టిడిపి అని టిడిపి తోనే బీసీలకు రాజకీయ లబ్ధి చేకూరాలని పొందని వెంకటేశ్వర రావు అన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులకు గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని డాక్టర్ పాశం వెంకటేశ్వరావు అన్నారు.