గ్రామాభివృద్ధి పనులపై ట్రైనీ కలెక్టర్ పరిశీలన
నవాబుపేట సూర్య న్యూస్:మండలంలోని ఇప్పటూర్ గ్రామ పంచాయతీని ట్రైనీ కలెక్టర్ క్రిస్టియానా శుక్రవారం సందర్శించారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు,గ్రామంలో నెలకొన్న సమస్యలు,ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సేవలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.పనుల అమలు తీరు,కూలీలకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.గ్రామాభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవికిరణ్,ఏపీఓ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.