మెదక్ జిల్లాలో దళితులపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి
మెదక్ జిల్లాలో దళితులపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, దాడులను అరికట్టెందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, దాడులు జరిగిన కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు టి స్కైలాబ్ బాబు, యం అడివయ్య, కె మల్లేశం, నర్సిములు, దేవయ్య, నరేందర్ లతో కూడిన KVPS, AIAWU ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్ లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ డిప్యుటీ డైరెక్టర్ రమాదేవి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్బంగా KVPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ* రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న మెదక్ జిల్లాలో బతుకమ్మ, దసరా పండుగ ఉత్సవాల సందర్భంగా దళితులపై 6 గ్రామాల్లో దాడులు,ఒక్క గ్రామంలో సాంఘిక బహిష్కరణ జరిగింది. జిల్లాలోని మనోహరాబాద్ మండలం పీటీ కోనాయిపల్లి,కుచారం, తూప్రాన్ మండలం కిష్టాపూర్, శివ్వంపేట మండలం నవాబ్‌పేట్, హవేలీ ఘనపూర్, వెల్దుర్తి మండలం ఎదులపల్లి గ్రామాల్ల దళితులపై దాడులు, దౌర్జన్యాలు జరిగాయి.
మనోహరాబాద్ మండలం పీటీ కోనాయిపల్లిలో డప్పులు కొట్టేందుకు కనీస వేతనం ఇవ్వాలని అడిగినందుకు గ్రామ సర్పంచ్ మన్నే కళ్యాణ్ మరియు అతని అనుచరులు సుమారు 30 మంది దళితులను కులం పేరుతో దుశిస్తూ, దాడి చేశారు.దాడిలో 15 మంది మహిళలు, పురుషులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మహిళలను సైతం దూషిస్తూ దాడి చేశారు , ముగ్గురు గ్రామ పంచాయతీ కార్మికులకు గాయలు అయ్యాయి. మనోహరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన FIR No. 287/2026లో హత్యాయత్నం సెక్షన్లు చేర్పి నిందితులను అరెస్ట్ చేయాలను అరెస్ట్ చేయాలి.
కుచారం గ్రామంలో దళిత సర్పంచ్ ఎర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాల స్థలాన్ని అవమానిస్తూ కులవివక్ష ప్రదర్పించారు, దీనిని ప్రశ్పించిన దళిత సర్పంచ్ భర్త రముపై ఆరుగురు దాడి చేసి కులం పేరుతో దూపించారు.ఈ ఘటనపై FIR No. 289/2026 కింద కేసు నమోదు అయినప్పటికీ నిందితులను ఇంకా అరెస్ట్ చేయలేదు
హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో దళితులు బతుకమ్మ ఆడుకుంటుండగా అడ్డుకుని దాడి చేశారని ఆరోపించారు. అనంతరం దళితులపైనే అక్రమ కేసులు నమోదు చేశారని తెలిపారు. FIR No. 231/2026లో నమోదైన కేసులను ఎత్తివేయాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాపీటీ కేసులో FIR No. 232/2026 ప్రకారం వడ్ల వాణిపై చర్యలు తీసుకోవాలి
తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామంలో దళిత మహిళలు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడాన్ని అగ్రకులాల వారు జీర్ణించుకోలేక సామాజిక బహిష్కరణకు పాల్పడ్డారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం చేసింది.
KVPS రాష్ట్ర కమిటీ సభ్యులు యం అడివయ్య మాట్లాడుతూ* శివ్వంపేట మండలం నవాబ్‌పేట్ గ్రామంలో చెంది సాయిలు, ఆయన కుమారుడు చెంది సన్సీలపై దాడి చేసి కులం పేరుతో దూపించారని, సన్నీ గొంతు నులిమి గాయపరిచారు. అక్టోబర్ 18 నాడు రాత్రి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే అక్టోబర్ 25 వరకు కూడా కేసు నమోదు చేయలేదు. పై అధికారులు ఒత్తిడి చేసిన తరువాత పోలీసులు నామమాత్రపు కేసులు మాత్రమే నమోదు చేశారని తెలిపారు. FIR No. 241/2026లో హత్యాయత్నం సెక్షన్లు చేర్చి నిందితులను కఠినంగా శిక్షించాలి.నిందితుల నుండి బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. కోనాయిపల్లి, నవాబ్‌పేట్ గ్రామాల్లో దాడికి గురైన దళితులపైనే కౌంటర్ కేసులు నమోదు చేశారు. నవాబ్‌పేట్ ఘటనలో పిటిషన్ ఇచ్చిన తర్వాత ఆలస్యంగా కేసు నమోదు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది అట్రాసిటీ కేసుల్లో నిర్లక్ష్యం వహించిన మనోహరాబాద్, శివ్వంపేట SIలను సస్పెండ్ చేయాలి.ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో విచారణ అధికారిగా ఉన్న తుప్రాన్ డిఎస్పి విచారణలో బాధితుల పక్షాన కాకుండా నిందితుల పక్షాన నిలబడడం అనేక అనుమానలకు తవిస్తుంది. డిఎస్పి విచారణపై దళితులకు నమ్మకం కల్గడం లేదు. విచారణ అధికారిగా ఉన్న తుప్రాన్ డిఎస్పిని మార్చాలని, తుప్రాన్ సబ్ డివిజన్ పరిధిలో నమోదు అయినా అట్రాసిటీ కేసుల్లో విచారణ వేగవంతం చేసి, నిందితులను అరెస్ట్ చేసి బాధితులకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విచారణ జరిపిస్తాం: ఎస్సీ, ఎస్టీ కమిషన్ డిప్యుటీ డైరెక్టర్ రమాదేవి
మెదక్ జిల్లాలో దళితులపై జరిగిన దాడులపై సమగ్ర విచారణ జరిపిస్తామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ డిప్యుటీ డైరెక్టర్ రమాదేవి హామీ ఇచ్చారు.
వినతిపత్రం అందచేసిన ప్రతినిధి బృందంలో KVPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు యం అడివయ్య, AIAWU రాష్ట్ర కమిటీ సభ్యులు కె మల్లేశం, నర్సిములు, మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు దేవయ్య, నరేందర్ తదితరులు పాల్గొన్నారు