BREAKING
రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా పొలమూరును తీర్చిదిద్దుతాం - మాజీ ఉప సర్పంచ్ సత్తి సూరారెడ్డి. ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించాలి. డి.ఎస్.పి దైవ ప్రసాద్ . ఆత్మకూరు నుండి వివిధ ప్రాంతాలకు బస్సులు నడపాలి. అయ్యప్ప స్వామి ఆలయానికి వాటర్ ఫిల్టర్ బహుకరించిన బొంతల రాజిరెడ్డి భూమనకు చెంపపెట్టు...జేబీకి క్లీన్ చీట్ -భూమన కక్ష సాధింపు కేసులో జేబీ విజయం -వైసీపీ పెట్టిన అక్రమ కేసును కొట్టివేసిన కోర్టు -3 ఏళ్ల పోరాటం తర్వాత జేబీ శ్రీనివాస్ కు కోర్టులో న్యాయం -ఎన్నికలవేళ తొలివిజయంగా భావిస్తున్న కూటమి నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ నడవాలి సిపిఎం అభ్యర్థిని రెడ్డి లక్ష్మిని గెలిపించండి పెంగరగుంటలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి దిశానిర్దేశం అయ్యప్ప స్వాములకు మహా అన్న ప్రసాద వితరణ ఇరుసుమండలో పంట పొలాలను పరిశీలించిన ఏరువాక శాస్త్రవేత్తలు - రైతులకు సూచనలు తుపాన్ దెబ్బకు పడిపోయిన వరికి ప్రాణం పోసే ప్రయత్నం రాష్ట్ర ప్రగతిపై ప్రజలు హర్షం...ఎమ్మెల్యే "కోండ్రు" వెంకన్న సన్నిధి నుంచి చిర్ల జగ్గిరెడ్డి స్థానిక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం పెండింగ్‌ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్‌ఓసీలను త్వరగా మంజూరు చేయాలి.. అర్హులకు సకాలంలో వైద్యసాయం అందాలి: ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రీడలకు ప్రాధాన్యత - మంత్రి పొంగులేటి అయ్యప్ప, శివమాలధారణ స్వాములకు అన్న సమారాధన.

ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన 14 సంస్థలపై చర్యలు - అదనపు కలెక్టర్ ఆర్.ఎస్ చిత్రు

Select Suryaa Now
ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన 14 సంస్థలపై చర్యలు - అదనపు కలెక్టర్ ఆర్.ఎస్ చిత్రు
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ, ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి బి. ప్రత్యూష స్పష్టం చేశారు.ఆహార భద్రత ప్రమాణాల చట్టం–2006 కింద ఆదిలాబాద్ పట్టణంలోని వివిధ ఆహార వ్యాపార సంస్థలపై నమోదు చేసిన 14 కేసులను న్యాయనిర్ణయ అధికారి, అదనపు కలెక్టర్ ఆర్ ఎస్ చిత్రు విచారించి పరిష్కరించినట్లు ఆమె తెలిపారు. ఈ కేసుల్లో సంబంధిత సంస్థలకు మొత్తం రూ.3.55 లక్షల జరిమానా విధించినట్లు వెల్లడించారు.
జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి బి. ప్రత్యూష నమోదు చేసిన కేసుల విచారణ అనంతరం ఈ మేరకు జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు.
జరిమానా విధించిన సంస్థల వివరాలిల వున్నాయి పట్టణంలోని వరుణ్ బార్ అండ్ రెస్టారెంట్‌కు రూ.1,00,000.డీబీ హోల్‌సేల్ సంస్థకు రూ.50,000.సప్తగిరి ఆయిల్స్ సంస్థకు రూ.50,000.ఇతర 11 కేసులకు సంబంధించి రూ.1,55,000.మొత్తం 14 కేసుల్లో రూ.3,55,000 జరిమానా విధించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు, ఆహార తయారీ, విక్రయ సంస్థల నిర్వాహకులు తప్పనిసరిగా ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల సమయంలో నాణ్యత, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రతి ఆహార వ్యాపార సంస్థ చెల్లుబాటయ్యే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ కలిగి ఉండటంతో పాటు, దానిని వినియోగదారులకు కనిపించే ప్రదేశంలో ప్రదర్శించాలని సూచించారు.నాణ్యత లేని ఆహార పదార్థాల విక్రయాలు, తప్పుడు లేబుళ్లతో ఉత్పత్తుల అమ్మకాలు, సురక్షితం కాని ఆహార పదార్థాల సరఫరా, పరిశుభ్రత భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. వినియోగదారులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించడం ప్రతి ఆహార వ్యాపార సంస్థ బాధ్యత అని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని సంస్థలపై తనిఖీలు నిర్వహించి, చట్టప్రకారం జరిమానాలు విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి స్పష్టం చేశారు.