BREAKING
వరద ముంపు ప్రాంతాల్లో ఆరోగ్య సేవలపై ప్రత్యేక దృష్టి.. * ఆరోగ్య విస్తరణ అధికారి నల్లి రవికుమార్ * పోలింగ్ కేంద్రాల తనిఖీ ప్రజల్లో అపోహలు సృష్టించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు మహిమలూరు పంచాయతీలో టీడీపీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం పద్మనాభంలో సంచలన హత్య కేసు..!! * గంటల వ్యవధిలో ఛేదించిన పద్మనాభం పోలీసులు * ఎన్నికల నియమావళిని పాటించాలి. మురుగళ్ళ పంచాయతీలో టీడీపీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం సూర్య కథనానికి అధికారుల స్పందన అశేష జనవాహిని తోజనసంద్రంగా మారిన ఆత్మకూరు పట్టణం --టీడీపీ–ఎన్డీయే కూటమి మహార్యాలీ మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. నవంబర్ 1న పోలింగ్ సహన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం హోరెత్తించిన మొల్లి హేమంత్ ప్రచారం గిద్దలూరులో కూటమి శక్తి ప్రదర్శన.. వేలాది మందితో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి భారీ ర్యాలీ పట్టభద్రుల ఓటే ప్రభుత్వానికి గట్టి సమాధానం!* *ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి..* *అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలి: ఆర్.జె.సి. కృష్ణ* వైరా రూరల్ (సూర్య న్యూస్):- స్థానిక సంస్థల ఎన్నికలకు 4,277 మంది పోలింగ్ సిబ్బంది కేటాయింపు

భూమనకు చెంపపెట్టు...జేబీకి క్లీన్ చీట్ -భూమన కక్ష సాధింపు కేసులో జేబీ విజయం -వైసీపీ పెట్టిన అక్రమ కేసును కొట్టివేసిన కోర్టు -3 ఏళ్ల పోరాటం తర్వాత జేబీ శ్రీనివాస్ కు కోర్టులో న్యాయం -ఎన్నికలవేళ తొలివిజయంగా భావిస్తున్న కూటమి నేతలు

Select Suryaa Now
భూమనకు చెంపపెట్టు...జేబీకి క్లీన్ చీట్  -భూమన కక్ష సాధింపు కేసులో జేబీ విజయం -వైసీపీ పెట్టిన అక్రమ కేసును కొట్టివేసిన కోర్టు -3 ఏళ్ల పోరాటం తర్వాత జేబీ శ్రీనివాస్ కు కోర్టులో న్యాయం  -ఎన్నికలవేళ తొలివిజయంగా భావిస్తున్న కూటమి నేతలు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా జేబీ శ్రీనివాస్ పై భూమన కుటుంబం కక్ష సాధింపు చర్యలకు దిగింది. 2022లో పెట్టిన అక్రమ కేసులో న్యాయస్థానం శుక్రవారం జేబీ శ్రీనివాస్ కు క్లీన్ చిట్ ఇస్తూ తీర్పునిచ్చింది. నగరపాలక సంస్థ రెండవ సాధారణ ఎన్నికల సమయంలో ఆయనకు క్లీన్ చీట్ రావడం పట్ల కూటమినేతను సంబరాలు చేసుకుంటున్నారు. తిరుపతి నగరంలో జేబీకి క్లీన్ చీట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. 

మూడేళ్ల సుదీర్ఘ పోరాటానికి తెర..

2022 మున్సిపల్ ఎన్నికలలో వైసిపి చేస్తున్న దొంగ ఓట్లు దంతాను ప్రశ్నించినందుకు టిడిపి నాయకులు జెబి శ్రీనివాస్, విజయ్ కుమార్, వెంకట కీర్తిలపై, అప్పటి వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు భూమన అభినయ్, పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని ఎస్వియు పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు నమోదు చేశారు. దీనిపై మూడేళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసిన జెబికి ఎట్టకేలకు ధర్మం తన వైపు నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. దీంతో వైసిపి రౌడీ రాజ్యం గతంలో ఎలా ఉండేదో బయటపడిందన్నారు మమ్మలను అరెస్టు చేసి మా కుటుంబాలను భయపెట్టాలని చూసారని, అక్రమ కేసులు పెట్టి మా జీవితాలతో ఆడుకున్న కరుణాకర్ రెడ్డి, అభినయ రెడ్డి తిరుపతి ప్రజలకు కోటి తీర్పుతో ఏమి సమాధానం చెప్తారని ప్రశ్నించారు. పుర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని రౌడీ రాజ్యం కావాలో న్యాయం కోసం పోరాడే కూటమి రాజ్యం కావాలో తేల్చుకోవాలని సూచించారు. ఆదివారం ప్రజా పోర్టులో వైసిపికి నగర ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. 

కూటమిలో సంబరాలు 

గత ప్రభుత్వం జేబీతో పాటు పలువులు టిడిపి నేతలపై బనయించిన అక్రమ కేసుల్లో కోర్టు క్లీన్ చీట్ ఇవ్వడంతో నగరంలో కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు. ఎన్నికల ముందు వైసిపికి ఇదో చెంప పెట్టని హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు కూటమికి నైతిక బలాన్ని ఇచ్చిందని వైసిపి కుట్రలు బహిర్గతమయ్యాయని టిడిపి జనసేన బిజెపి నేతలు సంబరాలు చేసుకుంటూ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఈ తీర్పు ఆదివారం జరుగునున్న ఎన్నికలపై ప్రభావం చూపడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్