BREAKING
సన్ ఫార్మాకు కేంద్రం భారీ షాక్ మందనపల్లిలో జలసిరి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తొలి ఆరు నెలల్లో ₹7.14 లక్షల కోట్ల ద్రవ్యలోటు: సీజీఏ (CGA) కీలక నివేదిక 2,52,397 మంది పింఛన్ దారులకు రూ. 111 కోట్లు పంపిణీ లలిత్ సూరి హాస్పిటాలిటీ భారీ విస్తరణ ప్రణాళికలు: ఐదేళ్లలో 1,000 కొత్త గదులు.. అహ్మదాబాద్‌లో లగ్జరీ హోటల్ ప్రాజెక్ట్! భూ వివాదం.. ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఇద్దరికి తీవ్ర గాయాలు మైకేల్ కోర్స్ మాతృ సంస్థ 'కాప్రి' షేర్ల సునామీ భట్టిప్రోలు 1వ సెగ్మెంట్ ప్రచారంలో పాల్గొన్న సాయిబాబా కేఎఫ్‌సీ, పిజ్జాహట్ ఫ్రాంచైజీల విలీనానికి సీసీఐ (CCI) ఆమోదం.. ఒకే గొడుగు కిందకు దేవయాని, సఫైర్ ఫుడ్స్ కార్యకలాపాలు! 'వికసిత్ భారత్' లక్ష్యంగా హై-లెవెల్ కమిటీ ఏర్పాటు! ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి గాత్రం సౌమ్యశ్రీ కి సెగ్మెంట్లో సాదర స్వాగతం ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ భారీ ఆర్థిక భరోసా డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో అవకతవకలు! ఉక్రెయిన్‌లోని ఒలేష్కీలో అరుదైన మానవతా విరామం

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. నవంబర్ 1న పోలింగ్

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. నవంబర్ 1న పోలింగ్

నెల్లూరు కలెక్టరేట్, మేజర్ న్యూస్ :   జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీల్లో నవంబర్ 1వ తేదీన జరగనున్న పోలింగ్‌ను ప్రశాంతంగా, పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు.

5.52 లక్షల మంది ఓటర్లు.. 594 పోలింగ్ కేంద్రాలు

జిల్లాలోని మూడు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మొత్తం 128 వార్డులకు 594 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 5,52,318 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 2,68,309 మంది పురుషులు, 2,83,921 మంది మహిళలు, 88 మంది ఇతర ఓటర్లు ఉన్నారు.  నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 72 వార్డులు, 509 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 4,89,351 మంది ఓటర్లు ఉన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో 28 వార్డులు, 30 పోలింగ్ కేంద్రాలకు 26,529 మంది ఓటర్లు ఉన్నారు. బుచ్చిరెడ్డిపాళెంలో 28 వార్డులు, 55 పోలింగ్ కేంద్రాలకు 36,438 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

52 అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాలు

ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని 594 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకత ఆధారంగా మూడు విభాగాలుగా గుర్తించారు. వీటిలో 52 అత్యంత సున్నిత, 200 సున్నిత, 342 సాధారణ పోలింగ్ కేంద్రాలుగా వర్గీకరించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 52 అత్యంత సున్నిత, 174 సున్నిత, 283 సాధారణ కేంద్రాలు ఉన్నాయి. ఆత్మకూరులో 30 సాధారణ కేంద్రాలు ఉండగా, బుచ్చిరెడ్డిపాళెంలో 26 సున్నిత, 29 సాధారణ కేంద్రాలను గుర్తించారు.

పోలింగ్ విధులకు 4,351 మంది సిబ్బంది

ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు మొత్తం 4,351 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 713 మంది ప్రిసైడింగ్ అధికారులు, 713 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 2,851 మంది ఇతర పోలింగ్ అధికారులు, 74 మంది మైక్రో అబ్జర్వర్లు ఉన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థకు 3,720 మంది, ఆత్మకూరుకు 230 మంది, బుచ్చిరెడ్డిపాళెంకు 401 మంది సిబ్బందిని కేటాయించారు.

1,725 మంది పోలీసులతో పటిష్ట భద్రత

పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లావ్యాప్తంగా 1,725 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో 31 మంది సీఐలు, 88 మంది ఎస్సైలు, 346 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 897 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 363 మంది హెడ్ కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు.

రవాణా కోసం 115 వాహనాలు

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది రవాణా, ఇతర అవసరాల కోసం 115 వాహనాలను సిద్ధం చేశారు. వీటిలో 33 కార్లు, 82 బస్సులు ఉన్నాయి. నెల్లూరుకు 85, ఆత్మకూరుకు 17, బుచ్చిరెడ్డిపాళెంకు 13 వాహనాలను కేటాయించారు.

ఎన్నికల నిఘాకు 50 ప్రత్యేక బృందాలు

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఎన్నికల వ్యయ పరిశీలన, అక్రమ నగదు, ఇతర ప్రలోభాల నియంత్రణ కోసం 50 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీటిలో 11 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 16 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, 23 ఎన్నికల ప్రవర్తనా నియమావళి పర్యవేక్షణ బృందాలు ఉన్నాయి. వీటిని నెల్లూరులో 33, ఆత్మకూరులో 6, బుచ్చిరెడ్డిపాళెంలో 11 చొప్పున నియమించారు.

1,790 పోస్టల్ బ్యాలెట్లు జారీ

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, సర్వీస్ ఓటర్లు, పీడీ యాక్ట్ పరిధిలోని ఓటర్లకు మొత్తం 1,790 పోస్టల్ బ్యాలెట్లను జారీ చేశారు. వీటిలో ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి 1,677, సర్వీస్ ఓటర్లకు 99, పీడీ యాక్ట్ పరిధిలోని ఓటర్లకు 14 పోస్టల్ బ్యాలెట్లు అందించారు. మున్సిపాలిటీల వారీగా నెల్లూరుకు 1,390, ఆత్మకూరుకు 208, బుచ్చిరెడ్డిపాళెంకు 192 పోస్టల్ బ్యాలెట్లను కేటాయించారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల సూచించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.