మురుగళ్ళ పంచాయతీలో టీడీపీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆశీస్సులతో ఆత్మకూరు మండల జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డి , మురుగుళ్ల సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థి పువ్వాడి వెంకటేశ్వర్లు మురుగళ్ళలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మురుగళ్ళ పంచాయతీలో అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రచారం చేపట్టారు. గ్రామంలోని ప్రజలతో మాట్లాడి స్థానిక సమస్యలు, గ్రామాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల రాకతో ప్రచార కార్యక్రమం సందడిగా సాగింది. స్థానిక నాయకులు, కార్యకర్తలు అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు.