గిద్దలూరులో కూటమి శక్తి ప్రదర్శన.. వేలాది మందితో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి భారీ ర్యాలీ
గిద్దలూరు, మేజర్‌న్యూస్ :
పట్టణ మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం తరఫున గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు గా 5 వేల మంది కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులతో గాంధీ బొమ్మ సెంటర్ నుండి గణేష్ నగర్, చిన్న మార్కెట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సాగిన మార్గమంతా అభిమానులు ఎమ్మెల్యే గారికి శాలువాలు, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపించారు. మహిళలు హారతులు పట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు గిద్దలూరు పట్టణ అభివృద్ధి కొనసాగాలంటే స్థానికేతరులను తరిమికొట్టండి స్థానికులకు మనకు అందుబాటులో ఉండే నాయకులకు మద్దతు గా నిలిచి కూటమి అభ్యర్థులకు ప్రజల మద్దతు అవసరమని తెలిపారు. బీజేపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీ జె.వి. నారాయణ గారికి కమలం గుర్తుపై, 24 మంది కౌన్సిలర్ అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై, మరో నలుగురు కౌన్సిలర్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ MP పాక సత్యనారాయణ , బీజేపీ MLC సోము వీర్రాజు, రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు షేక్ భాష , రాష్ట్ర కార్యదర్శి నాగబోతు రమేష్ నాయుడు, pv కృష్ణ రావు, తదితర నాయకులు, పట్టణ కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు అభిమానులు తదితరులు భారీగా ర్యాలీలో పాల్గొన్నారు