రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా పొలమూరును తీర్చిదిద్దుతాం - మాజీ ఉప సర్పంచ్ సత్తి సూరారెడ్డి.
అనపర్తి, మేజర్ న్యూస్: రానున్న రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి స్వగ్రామమైన పొలమూరును రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప సర్పంచ్ సత్తి సూరారెడ్డి అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం పొలమూరు గ్రామంలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సూరారెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. గతంలో తమ పాలనలో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో గ్రామంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. పొలమూరు గ్రామాన్ని రాష్ట్రస్థాయిలో ఆదర్శ గ్రామంగా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని సూరారెడ్డి స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.