BREAKING
గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ క్రేజీ థ్రిల్లర్: నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఐ యామ్ గేమ్ సినిమా ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా సౌభాగ్యం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డి సాహెబ్ : పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు : ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ అల్లాబకష్ గుమ్మడి గింజలు చిన్నవే అయినా ప్రయోజనాలు ఎన్నో: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? గ్రామాల సమగ్రాభివృద్ధికై కూటమిని గెలిపించండి : తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జి జి.శంకర్ యాదవ్ పిలుపు - జెడ్పిటిసి అభ్యర్థి మూడే ప్రశాంత్ నాయక్ ని గెలిపించాలని విజ్ఞప్తి పైనాపిల్ తింటే జీర్ణక్రియకు నిజంగా ప్రయోజనకరమేనా? ఈ పండులో దాగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఏమిటి? అవిసె గింజల్లో దాగిన అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? వట్లూరులో కూటమి అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే చింతమనేని ఎన్నికల ప్రచారం చిలగడదుంప తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఆల్వాల్ లో ఘనంగా బీజేపీ ఆధ్వర్యంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. పలమనేరు ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించిన కమిషనర్ విజయశేఖర్

ఓటరు కార్డు లేకపోయినా ఓటు వేయవచ్చు.. ప్రత్యామ్నాయంగా 20 రకాల గుర్తింపు కార్డులకు అనుమతి!

Select Suryaa Now
ఓటరు కార్డు లేకపోయినా ఓటు వేయవచ్చు.. ప్రత్యామ్నాయంగా 20 రకాల గుర్తింపు కార్డులకు అనుమతి!

నెల్లూరు కలెక్టరేట్, మేజర్ న్యూస్ :  నవంబర్ 1న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్.. ఓటర్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డు తీసుకురావాలి
స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నవంబర్ 1న జరగనున్న నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం కీలక వెసులుబాటు కల్పించింది. ఓటరు గుర్తింపు కార్డు (EPIC) లేని వారు ప్రత్యామ్నాయంగా 20 రకాల ఫొటో గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని చూపించి ఓటు వేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు.

ఈ మేరకు ఆయన శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గుర్తింపు పత్రాన్ని వెంట తీసుకురావాలని సూచించారు.

అనుమతించిన 20 రకాల గుర్తింపు పత్రాలు ఇవే..

1. ఆధార్ కార్డు.
2. పాస్‌పోర్ట్.
3. డ్రైవింగ్ లైసెన్స్.
4. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన పాన్ కార్డు.
5. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులు.
6. ఫొటోతో కూడిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్.
7. మాజీ సైనికుల పెన్షన్ పుస్తకం.
8. వృద్ధాప్య, వితంతు పెన్షన్ పత్రాలు.
9. ఫొటోతో కూడిన పట్టాదారు పాస్‌బుక్‌లు, రిజిస్టర్డ్ ఆస్తి పత్రాలు.
10. ప్రభుత్వ రంగ బ్యాంకులు, పోస్టాఫీసులు, APCOB, DCCBలు జారీ చేసిన ఫొటో పాస్‌బుక్‌లు.
11. కిసాన్ పాస్‌బుక్‌లు.
12. బ్యాంకులు జారీ చేసిన ఫొటోతో కూడిన ఏటీఎం కార్డులు.
13. ఫొటోతో కూడిన రేషన్ కార్డులు.
14. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) కింద RGI జారీ చేసిన స్మార్ట్ కార్డులు.
15. ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు.
16. సంబంధిత అధికార సంస్థ జారీ చేసిన ఫొటోతో కూడిన SC, ST, BC ధ్రువీకరణ పత్రాలు.
17. ఫొటోతో కూడిన స్వాతంత్ర్య సమరయోధుల గుర్తింపు కార్డులు.
18. ఫొటోతో కూడిన ఆయుధ లైసెన్సులు.
19. సంబంధిత అధికారి జారీ చేసిన ఫొటోతో కూడిన దివ్యాంగ ధ్రువీకరణ పత్రం.
20. బార్ కౌన్సిళ్లు, కార్మిక మంత్రిత్వ శాఖ, శాసనసభ, శాసనమండలి, లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు జారీ చేసిన సంబంధిత ఫొటో గుర్తింపు, సభ్యత్వ, ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డులు.

ఓటరు గుర్తింపు కార్డు అందుబాటులో లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎన్నికల సంఘం అనుమతించిన ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని పోలింగ్ కేంద్రంలో చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ నవంబర్ 1న జరిగే పోలింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.