పెంగరగుంటలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి దిశానిర్దేశం
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు: పలమనేరు మండలంలోని పెంగరగుంట పంచాయతీలో నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల పరిచయ వేదిక కార్యక్రమానికి ఎమ్మెల్యే అమరనాథరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థులను పరిచయం చేసుకుని, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార తీరు, ప్రజలతో మమేకమయ్యే విధానాలపై పలు సూచనలు చేశారు.ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని, గ్రామస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ, పార్టీ ఆశయాలు, ప్రజల కోసం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని కోరారు. అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే అమరనాథరెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్