BREAKING
పద్మనాభంలో సంచలన హత్య కేసు..!! * గంటల వ్యవధిలో ఛేదించిన పద్మనాభం పోలీసులు * ఎన్నికల నియమావళిని పాటించాలి. మురుగళ్ళ పంచాయతీలో టీడీపీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం సూర్య కథనానికి అధికారుల స్పందన అశేష జనవాహిని తోజనసంద్రంగా మారిన ఆత్మకూరు పట్టణం --టీడీపీ–ఎన్డీయే కూటమి మహార్యాలీ మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. నవంబర్ 1న పోలింగ్ సహన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం హోరెత్తించిన మొల్లి హేమంత్ ప్రచారం గిద్దలూరులో కూటమి శక్తి ప్రదర్శన.. వేలాది మందితో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి భారీ ర్యాలీ పట్టభద్రుల ఓటే ప్రభుత్వానికి గట్టి సమాధానం!* *ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి..* *అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలి: ఆర్.జె.సి. కృష్ణ* వైరా రూరల్ (సూర్య న్యూస్):- స్థానిక సంస్థల ఎన్నికలకు 4,277 మంది పోలింగ్ సిబ్బంది కేటాయింపు 30వ వార్డులో తూముల సుజాతకు మద్దతుగా మాజీ మంత్రి అప్పలరాజు ప్రచారం ఓటరు కార్డు లేకపోయినా ఓటు వేయవచ్చు.. ప్రత్యామ్నాయంగా 20 రకాల గుర్తింపు కార్డులకు అనుమతి! ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి… రాహుల్ గాంధీ పిలుపుతో చలో ఢిల్లీకి కొల్చారం కాంగ్రెస్ నాయకులు:

అయ్యప్ప స్వాములకు మహా అన్న ప్రసాద వితరణ

Select Suryaa Now
అయ్యప్ప స్వాములకు మహా అన్న ప్రసాద వితరణ

ఆరిలోవ, సూర్య : హనుమంతువాక ప్రాంతంలో ఉన్న శ్రీ భక్త తుకారాం రామాలయంలో శుక్రవారం  శ్రీరామ అయ్యప్ప అన్నదానం ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల కాలం5 అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములకు
అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు  గురుస్వామి బైపల్లి సోమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా భక్తతుకారం  రామాలయంలో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి స్వాములు,  భవానీలు పాల్గొని స్వామి వారి ప్రసాదం స్వీకరించారు. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా స్వాములు కొరకు ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, నేటి నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు మహా అన్నదాన వితరణ కార్యక్రమం కొనసాగుతుందని  సోమేశ్ గురు స్వామి తెలిపారు. అన్న ప్రసాద వితరణలో పాల్గొన్న బాయిన రాణి.. తూర్పు నియోజకవర్గంలో స్థానిక 12వ వార్డు జనసేన కార్పొరేటర్ అభ్యర్థి బాయిన రాణి భక్తతుకారం రామాలయంలో ప్రారంభమైన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న స్వాములకు, భవానీలకు ఆమె చేతుల మీదగా ప్రసాద వితరణ చేశారు. శ్రీరామ అయ్యప్ప అన్నదానం ట్రస్ట్ సభ్యులు ఆమెకు శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.