BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

ఇరుసుమండలో పంట పొలాలను పరిశీలించిన ఏరువాక శాస్త్రవేత్తలు - రైతులకు సూచనలు తుపాన్ దెబ్బకు పడిపోయిన వరికి ప్రాణం పోసే ప్రయత్నం

Select Suryaa Now
ఇరుసుమండలో పంట పొలాలను పరిశీలించిన ఏరువాక శాస్త్రవేత్తలు - రైతులకు సూచనలు  తుపాన్ దెబ్బకు పడిపోయిన వరికి ప్రాణం పోసే ప్రయత్నం

 అంబాజీపేట మేజర్ న్యూస్  :అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామంలో అర్నాబ్ తుపాన్ కారణంగా దెబ్బతిన్న వరి పంట పొలాలను ఏరువాక కేంద్రం, జిల్లా వనరుల కేంద్రం అధికారులు, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బాపట్ల విద్యార్థులు, వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా తుపాన్ కారణంగా నేలకొరిగిన వరి చేలల్లో నష్ట నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు.
రైతులకు శాస్త్రవేత్తలు పలు సూచనలతో అవగాహన కల్పించారు.వర్షపు నీటిలో మునిగిన వరి చేలల్లో వెంటనే నీటిని బయటకు తీసేందుకు ఏర్పాట్లు చేయాలని,గాలులకు పడిపోయిన వరి దుబ్బులను నిలబెట్టి కట్టుకోవాలి.తెగుళ్లు సోకకుండా నీరు తీసిన తర్వాత ఎకరాకు 200 ఎంఎల్ చొప్పున ప్రోపికోన్జోల్ 
మందును పిచికారీ చేయాలి,గింజ గట్టిపడే దశలో ఉన్న పంటల్లో నీరు తీసిన తర్వాత 5 శాతం ఉప్పు ద్రావణాన్ని (5 కిలోల కల్లు ఉప్పును 100 లీటర్ల నీటిలో కలిపి) పిచికారీ చేయాలి. దీనివల్ల గింజ రంగు మారకుండా ఉంటుందన్నారు.ఈ క్షేత్ర పరిశీలన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏరువాక కేంద్రం మరియు జిల్లా వనరుల కేంద్రం అధికారుల పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఎం. శ్రీనివాసరావు, టీచింగ్ అసోసియేట్ పి.వి. అంజిబాబు,డిఎటిటిసి (ఏరువాక కేంద్రం) సెంటర్ కోఆర్డినేటర్ ఎం.నందకిశోర్, జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు ఎ.వి.ఎస్. రాజశేఖర్, వ్యవసాయ అధికారి జె.ఎన్.వి.వి. మనోహర్ కృష్ణ, మండల వ్యవసాయ అధికారి కె. ధర్మ ప్రసాద్, వ్యవసాయ విస్తరణ  పి.జాబేజ్ శాస్త్రి, ఇరుసుమండ గ్రామ వ్యవసాయ సహాయకులు అంతర్వేది సురేష్, గ్రామ రైతులు కె. సత్యనారాయణ, కె. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.