ఆత్మకూరు నుండి వివిధ ప్రాంతాలకు బస్సులు నడపాలి.
ఆత్మకూరు /మేజర్ న్యూస్: ఆత్మకూరు నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులు నడపాలని వనపర్తి జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కే రాఘవ డిమాండ్ చేశారు. ఆత్మకూరు మండల కేంద్రంలో శుక్రవారం ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లా అమరచింత చింతకుంట రేచింతల నర్వ గ్రామాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు ప్రతిరోజు ఆత్మకూరు పట్టణానికి పాఠశాలలు కళాశాలకు వెళ్లి విద్యను అభ్యసిస్తున్నారు కావున సంబంధిత ఆర్టీసీ అధికారులు బస్సులు నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.
_రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.