BREAKING
యూకే ఆన్‌లైన్ సేఫ్టీ డేటా డిమాండ్లపై న్యాయపోరాటంలో ఓడిన మెటా, టిక్‌టాక్, ఎక్స్! సన్ ఫార్మాకు కేంద్రం భారీ షాక్ మందనపల్లిలో జలసిరి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తొలి ఆరు నెలల్లో ₹7.14 లక్షల కోట్ల ద్రవ్యలోటు: సీజీఏ (CGA) కీలక నివేదిక 2,52,397 మంది పింఛన్ దారులకు రూ. 111 కోట్లు పంపిణీ లలిత్ సూరి హాస్పిటాలిటీ భారీ విస్తరణ ప్రణాళికలు: ఐదేళ్లలో 1,000 కొత్త గదులు.. అహ్మదాబాద్‌లో లగ్జరీ హోటల్ ప్రాజెక్ట్! భూ వివాదం.. ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఇద్దరికి తీవ్ర గాయాలు మైకేల్ కోర్స్ మాతృ సంస్థ 'కాప్రి' షేర్ల సునామీ భట్టిప్రోలు 1వ సెగ్మెంట్ ప్రచారంలో పాల్గొన్న సాయిబాబా కేఎఫ్‌సీ, పిజ్జాహట్ ఫ్రాంచైజీల విలీనానికి సీసీఐ (CCI) ఆమోదం.. ఒకే గొడుగు కిందకు దేవయాని, సఫైర్ ఫుడ్స్ కార్యకలాపాలు! 'వికసిత్ భారత్' లక్ష్యంగా హై-లెవెల్ కమిటీ ఏర్పాటు! ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి గాత్రం సౌమ్యశ్రీ కి సెగ్మెంట్లో సాదర స్వాగతం ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ భారీ ఆర్థిక భరోసా డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో అవకతవకలు!

*విద్యార్థులకు ఫోక్సో చట్టంపై న్యాయ అవగాహన..*

Select Suryaa Now
*విద్యార్థులకు ఫోక్సో చట్టంపై న్యాయ అవగాహన..*

టేక్మల్;సురక్షిత్ బచ్పన్ అభియాన్‌లో భాగంగా. శుక్రవారం మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని బోడ్మట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు,మెదక్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ అల్లాదుర్గ్  నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అల్లాదుర్గ్ జూనియర్ సివిల్ జడ్జి, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్‌పర్సన్ న్యాయమూర్తి ఎ.సుచరిత మాట్లాడుతూ.... బాలల హక్కులు, భద్రత, రక్షణ, సంక్షేమంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతి బాల, బాలికలు భయం లేకుండా సురక్షిత వాతావరణంలో జీవించడంతోపాటు విద్యను అభ్యసించి, తమ హక్కులను స్వేచ్ఛగా వినియోగించుకునే హక్కు కలిగి ఉంటారని తెలిపారు.బాల,బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు పాల్పడటం వంటి నేరాలకు పాల్పడితే పోక్సో చట్టం ప్రకారం కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. బాలలపై జరిగే హింస, వేధింపులు, లైంగిక దోపిడీ, ఇతర అనుచిత చర్యలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.విద్యార్థినులకు గుడ్ టచ్‌–బ్యాడ్ టచ్‌, వ్యక్తిగత భద్రత, లైంగిక వేధింపుల నివారణ, ఆన్‌లైన్ భద్రత, బాలల హక్కులపై వివరించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనా భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేయాలని సూచించారు.బాలల రక్షణకు సంబంధించిన చట్టాలు, వాటి ప్రాముఖ్యతతోపాటు అవసరమైన సందర్భాల్లో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ద్వారా అందించే ఉచిత న్యాయ సహాయం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. సెల్ ఫోన్లు, ఇంస్టాగ్రామ్ వల్ల బంగారు భవిష్యత్తు పాడు చేసుకోవద్దని అన్నారు,బాలల భద్రత కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదని, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. బాలల హక్కులను గౌరవిస్తూ వారికి సురక్షితమైన, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.విద్యార్థుల్లో బాలల హక్కులు, వ్యక్తిగత భద్రత, చట్టపరమైన రక్షణపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థినులు దుశ్చర్యలకు దూరంగా ఉంటూ అప్రమత్తంగా ఉండాలని, పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  అవినాష్ కుమార్, ఏ.ఎస్.ఐ శంకర్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, లత,ఉపాధ్యాయులు,  లీగల్ సర్వీసెస్ సిబ్బంది, టి.ఆంజనేయులు,విద్యార్థినులు పాల్గొన్నారు.