telangana
అయ్యప్ప స్వామి ఆలయానికి వాటర్ ఫిల్టర్ బహుకరించిన బొంతల రాజిరెడ్డి
కీసర, మేజర్ న్యూస్: కీసరలోని శ్రీ వరాల అయ్యప్ప స్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో బొంతల రాజిరెడ్డి వాటర్ ఫిల్టర్‌ను బహుకరించారు. ఆలయానికి వాటర్ ఫిల్టర్ అవసరమని నిర్వాహకులు కోరగానే స్పందించిన ఆయన తన వంతు సహకారంగా ఫిల్టర్‌ను అందజేశారు. భక్తుల సౌకర్యార్థం ఆయన చేసిన ఈ సేవ పట్ల ఆలయ నిర్వాహకులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. భక్తి భావంతో పాటు సేవా దృక్పథంతో ఆలయానికి సహకారం అందించడం అభినందనీయమని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా బొంతల రాజిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.