అశ్వారావుపేటలో డ్రంకెన్ డ్రైవ్‌లపై కొరడా..-ఇద్దరికి జైలు, ఇద్దరికి జరిమానా*
సూర్య అశ్వరావుపేట,మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారా..? జైలుకెళ్లక తప్పదని అశ్వారావుపేట పోలీసులు హెచ్చరిస్తున్నారు. మద్యం తాగి వాహనం నడిపిన కేసుల్లో ఇద్దరికి జైలు శిక్ష పడిన సంఘటన ఇవాళ స్పష్టమయింది.
అశ్వారావుపేట పోలీసులు ఇటీవల నిర్వహించిన స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారిని శుక్రవారం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఇద్దరికి రెండు రోజులు జైలు,మరో ఇద్దరికీ 2000 చొప్పున జరిమానా విధించిందని పోలీసులు తెలిపారు.
తాగి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు పోతున్నాయని,వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.అశ్వారావుపేట పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దనీ, కుటుంబాల గురించి ఆలోచించి, ట్రాఫిక్ రూల్స్, పాటించాలని ఆయన కోరారు.
సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట