BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

కూటమి అభ్యర్థులను గెలిపించి ట్రిపుల్ ఇంజన్ సర్కార్ కు బాటలు వేయండి

Select Suryaa Now
కూటమి అభ్యర్థులను గెలిపించి ట్రిపుల్ ఇంజన్ సర్కార్ కు బాటలు వేయండి

ఆలమూరు మేజర్ న్యూస్ కూటమి అభ్యర్థులను గెలిపించి ట్రీపుల్ ఇంజన్ సర్కార్కుకు  బాటలు వేసి  ఇచ్చిన ప్రతి హామీని నెరవేస్తున్నామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరుపున జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేయుచున్న దొండపాటి సుబ్బరాజుకు మండల పరిధిలోని కూటమి అభ్యర్థులుగా 21 ఎంపీటీసీలు గా పోటీ చేస్తున్న అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటుముద్రను  ఆయా గ్రామాల్లోని కూటమి తరుపున పోటీ చేసిన అభ్యర్థులు సైకిల్  గ్లాసు కమలం గుర్తుపై వేసి గెలిపించవలసినదిగా కోరుచున్నాను.
ఆలమూరు మండలంలో గ్రామ గ్రామాన కొత్తపేట జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్, భాజపా నేత తమలంపూడి రామకృష్ణారెడ్డి తదితరులతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు
, కూటమి నాయకుల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చిందని వారు తెలిపారు 
ఆలమూరు మండలంలో జడ్పిటీసీ అభ్యర్థి దొండపాటి సుబ్బరాజు తో పాటు 21 ఎంపీటీసీ స్థానాలను కూటమి గెల్చుకోవడం ఖాయమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం బడుగువానిలంకతో మొదలుపెట్టి మండలంలోని ప్రతి గ్రామంలోనూ కూటమి అభ్యర్థుల విజయం కోసం కొత్తపేట జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాస్, బిజెపి నాయకులు తమలంపూడి రామకృష్ణారెడ్డి తదితరులతో కలిసి ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే డబల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందని, స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థుల విజయం ద్వారా ట్రిపుల్ ఇంజన్ సర్కార్ కు బాటలు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థుల విజయం తప్పనిసరన్నారు. వైసీపీ హయాంలో సర్పంచ్, ఎంపీటీసీలకు కనీసం గౌరవం దక్కేది కాదని, ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, కూటమి అధికారంలోకి వచ్చాక రెండున్నర ఏళ్లలోనే పల్లెల్లో సీసీ రహదారులు, డ్రైనేజీలు, గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మాణం శరవేగంగా పూర్తి చేసామన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ మంత్రి నారా లోకేష్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని,శ్రమిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.  కేంద్రం నుంచి ప్రధాని మోదీ అన్ని విధాల సహకారం అందించి రాష్ట్రం అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని కొనియాడారు. వైసీపీ హయాంలో ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి జగన్ వచ్చి నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారన్నారు. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణంతో సహా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలన్నిటిని ధ్వంసం చేసి కక్ష సాధింపు రాజకీయాలు చేశారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక తిరిగి అభివృద్ధి వైపు రాష్ట్రం పయనిస్తుందన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా గ్రామాల్లో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరికేవని, కూటమి అధికారంలోకి వచ్చాక అదుపులో పెట్టడం జరిగిందన్నారు. యువత భవిష్యత్తు బాగుండాలి అంటే మరలా మరలా కూటమి అధికారంలోకి రావాలన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ కూటమి అయితే, అరాచకానికి కేరాఫ్ అడ్రస్ వైసీపీ అని ఎమ్మెల్యే విమర్శించారు. గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని తెలియజేశారు. కూటమి అభ్యర్థులు నూటికి నూరు శాతం విజయం సాధిస్తారని అన్నారు. ఎంపీటీసీ, జడ్పిటీసీ స్థానాల్లో కూటమిలోని ఏ పార్టీ పోటీలో ఉన్నా ఐక్యంగా అందరూ పనిచేసే ప్రతి సీటు గెలుచుకోవాలని నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.