BREAKING
సన్ ఫార్మాకు కేంద్రం భారీ షాక్ మందనపల్లిలో జలసిరి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తొలి ఆరు నెలల్లో ₹7.14 లక్షల కోట్ల ద్రవ్యలోటు: సీజీఏ (CGA) కీలక నివేదిక 2,52,397 మంది పింఛన్ దారులకు రూ. 111 కోట్లు పంపిణీ లలిత్ సూరి హాస్పిటాలిటీ భారీ విస్తరణ ప్రణాళికలు: ఐదేళ్లలో 1,000 కొత్త గదులు.. అహ్మదాబాద్‌లో లగ్జరీ హోటల్ ప్రాజెక్ట్! భూ వివాదం.. ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఇద్దరికి తీవ్ర గాయాలు మైకేల్ కోర్స్ మాతృ సంస్థ 'కాప్రి' షేర్ల సునామీ భట్టిప్రోలు 1వ సెగ్మెంట్ ప్రచారంలో పాల్గొన్న సాయిబాబా కేఎఫ్‌సీ, పిజ్జాహట్ ఫ్రాంచైజీల విలీనానికి సీసీఐ (CCI) ఆమోదం.. ఒకే గొడుగు కిందకు దేవయాని, సఫైర్ ఫుడ్స్ కార్యకలాపాలు! 'వికసిత్ భారత్' లక్ష్యంగా హై-లెవెల్ కమిటీ ఏర్పాటు! ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి గాత్రం సౌమ్యశ్రీ కి సెగ్మెంట్లో సాదర స్వాగతం ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ భారీ ఆర్థిక భరోసా డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో అవకతవకలు! ఉక్రెయిన్‌లోని ఒలేష్కీలో అరుదైన మానవతా విరామం

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

Select Suryaa Now
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

 

పాములపాడు మేజర్ న్యూస్: ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఏపీ దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శీలం శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. పాములపాడు మండలంలో నిర్వహించిన దివ్యాంగుల సమావేశం విజయవంతంగా జరిగింది. మండలంలోని అన్ని గ్రామాల నుంచి దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శీలం శ్రీనివాస్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగుల హక్కులు, సంక్షేమం, ప్రయోజనాల కోసం సహాయ సహకారాలు అందించే వారి పట్ల తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, స్వేచ్ఛగా తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.

సమావేశానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మండలంలోని అన్ని గ్రామాల దివ్యాంగులకు శీలం శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు