ఎన్నికల వేళ మద్యం దుకాణాలు బంద్!
ఎన్నికల వేళ మద్యం దుకాణాలు బంద్!
అనంతపురం జిల్లాలో ఆరు పట్టణాల్లో మద్యం అమ్మకాలపై నిషేధం.. కలెక్టర్ ఓ.ఆనంద్..
అనంతపురం..అర్బన్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మద్యం దుకాణాలను మూసివేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ ఆదేశించారు.అనంతపురం నగరపాలక సంస్థతో పాటు గుత్తి, గుంతకల్లు, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం మున్సిపాలిటీలు, వాటి పరిధిలోని 5 కిలోమీటర్ల ప్రాంతాల్లో ఈ నిషేధం అమలులో ఉంటుందని తెలిపారు.అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 1వ తేదీ వరకు మద్యం విక్రయాలు నిలిపివేయనున్నారు. నవంబర్ 2న రీపోలింగ్ జరిగితే ఆ రోజు కూడా నిషేధం కొనసాగుతుంది. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఉండదు.లిక్కర్ షాపులు, బార్లు, మిలిటరీ క్యాంటీన్లు, కల్లు దుకాణాలు తదితర మద్యం విక్రయ కేంద్రాలతో పాటు డిస్టిలరీలు, బ్రూవరీలపైనా నిషేధం అమలులో ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.