BREAKING
సూర్య కథనానికి అధికారుల స్పందన అక్రమ నిర్మాణాల పనులు నిలిపివేయాలని ఆదేశం ఎన్నికల సంఘం, ఎస్‌ఐఆర్‌పై అసత్య ప్రచారం ఆపాలి విబిజి రామ్‌జీ పనులు సమర్థవంతంగా చేపట్టాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి పీఎం-కిసాన్ 24వ విడత కింద రూ.18,690 కోట్లు విడుదల చేసిన కేంద్రం! గుంటూరు: కార్పొరేషన్ ఎన్నికలలో ఎంతమంది పోలీసులు, ఇతర ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారో తెలుసా!!! కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి............... తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అనంతపురం ప్రశాంతంగా ఉండాలంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించండి ఎస్టీఐసీ-2026 సదస్సులో డీఆర్‌డీఓ అద్భుత ప్రదర్శన! ఖేత్ బచావో అభియాన్‌పై గ్రామాల్లో శిక్షణ కార్యక్రమాలు ఏవో సారిక అదనపు కమిషనర్ జక్కుల సువార్తకు ఘనంగా వీడ్కోలు రెండు ఎన్నికలకు విధులు కేటాయించిన సిబ్బందికి ప్రత్యేక సూచనలు ఇమ్యునాలజీ మందుల విక్రయాలతో లాభాల అంచనాలను పెంచిన కంపెనీ! రాష్ట్రస్థాయి నాటక పోటీల్లో ఆకట్టుకున్న ఆర్‌ఎంఓ డాక్టర్‌ రవిశంకర్. రక్తదానం.. ప్రాణదానంతో సమానం - ఎస్సై

పేలవంగా సాగిన మండల సర్వసభ్య సమావేశం!

Select Suryaa Now
పేలవంగా సాగిన మండల సర్వసభ్య సమావేశం!
సూర్య పెద్ద కొడప్గల్: మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం పేలవంగా సాగింది. మండలంలోని మొత్తం 23 మంది సర్పంచులకు గాను కేవలం 8 మంది మాత్రమే సమావేశానికి హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పలుశాఖలకు చెందిన అధికారులు సైతం సమావేశానికి గైర్హాజరు కావడంతో సమావేశం నిర్వహణపై ప్రశ్నలు తలెత్తాయి.సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ తమ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికను చదివి వినిపించారు. మండలంలో అమలవుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు సేవల వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా  ఎంపిడిఓ అభినవ చంద్ర మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో మార్పులు, వర్షపాతం లోపం, అధిక ఉష్ణోగ్రతలు వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై ప్రభావం పడకుండా రైతులకు తగిన అవగాహన కల్పించాలని, నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని వివరించారు.
కాగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై చర్చించి సమస్యలకు పరిష్కారం చూపాల్సిన సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులు గైర్హాజరు కావడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.మండల అభివృద్ధికి సంబంధించిన కీలక సమావేశాలకే ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకాకపోతే గ్రామాల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశాలకు బాధ్యతగా హాజరై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.  మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహించే సమావేశాలకు అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై సమన్వయంతో పనిచేయాలని మండల ప్రత్యేకాధికారి బలరాం కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ప్రవీణ్ కుమార్ మండల పంచాయతీ అధికారి లక్ష్మికాంత రెడ్డి నాయబ్ తాసిల్దార్ వివిధ శాఖల అధికారులు సర్పంచులు పాల్గొన్నారు