telangana
రక్తదానం.. ప్రాణదానంతో సమానం - ఎస్సై
సూర్య, కాగజ్‌నగర్: రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ఇందిరా మార్కెట్‌లో శుక్రవారం రోజు పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు ఈ నెల 31న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఆరోగ్యంగా ఉన్నవారు రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడవచ్చని వివరించారు. రక్తదానం చేయడం ఆరోగ్యకరమైన సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్‌ఐ బి. యాదగిరి, ఏఎస్ఐ అనిల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.