సూర్య ఎల్లారెడ్డి : యెల్లారెడ్డి మండలంలోని అడవి లింగాల్ గ్రామపంచాయతి గ్రామం లో జరుగుతున్న పలు పనులను,ఎంపీడీవో తహరా బేగం శుక్రవారం సందర్శించారు అడవి లింగాల గ్రామంలో జరుగుతున్న పనులను పరిశీలించారు.అనంతరం ఆమె గ్రామ సర్పంచ్ సంతోష్ పంచాయతీ కార్యదర్శి జ్యోతి లతో మాట్లాడుతూ మ్యాజిక్ సోక్‌పిట్ల మార్కౌట్ వేసిన అనంతరం ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు డ్రైయిన్ ను ఇంకుడు గుంతలను పరిశీలించారూ. అలాగే ఎస్‌హెచ్‌జి (స్వయం సహాయక సంఘం) భవన నిర్మాణాన్ని పరిశీలించి, పనులను నవంబర్ 19వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నీటి వినియోగాన్ని తగ్గించాలని ఎల్ నినో నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ, సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి, జ్యోతి ఎఫ్‌ఏ జీవన్ గౌడ్ తో గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.