శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు గ్రామాల్లో విస్తృత పర్యటన
తెర్లాం, సూర్య : స్థానిక ఎన్నికలలో భాగంగా గ్రామాల్లో శాంతిభద్రతుల పరిరక్షణకు పోలీసు అధికారులు విస్తృత పర్యటన చేశారు. శుక్రవారం బొబ్బిలి సిఐ ఆర్ .మల్లికార్జునరావు ఎస్సై సాగర్ బాబులు సంయుక్తంగా ఉద్దవోలు సుందరాడ నెమలాం ఆమెటి సింగిరెడ్డి వలస గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి స్థానిక నాయకులు గ్రామస్తులతో మాట్లాడారు. గతంలో వివాదాలు ప్రస్తుత పరిస్థితులు ఎన్నికల సందర్భంగా ఆ సమస్యలపై ప్రజలకు సీఐ మల్లికార్జున రావు సవివరంగా అందించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజల సహకరించాలన్నారు. అందుకు ప్రతిష్టాత్మక మైన ముందస్తు చర్యలు చేపట్టినట్టు ఆయన వివరించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి ప్రత్యేకంగా ఉంచడంతో పాటు ఇప్పటికే తెర్లాం పోలీస్ స్టేషన్ పరిధిలోగల 870 మందిపైన చర్యలు చేపట్టినట్టు తెలియజేశారు. మఖ్యంగా సమస్యాత్మక గ్రామాలు ఉద్ద వోలు సుందరాడ బూరిపేట లోచర్ల పెరుమాలి కూనాయ వలస గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. పోలీస్ సిబ్బంది నిత్యo గ్రామాల్లో పర్యటిస్తూ స్థానిక పరిస్థితులపై సమాచారం సేకరించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వర్గ భేదాలు రెచ్చగొట్టడం ఓ టర్నీ బెదిరించడం ఘర్షణ సృష్టించడం వంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీ ఎలిమెంట్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని అవసరమైతే చట్ట ప్రకారం ముందస్తు అరెస్టులు కూడా చేస్తామని అందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. సోషల్ మీడియా పోస్టలు విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వ్యక్తిగత దూషణలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని అనుమానస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారితోపాటు ఏఎస్ఐ పోలీసులు గ్రామాలు పెద్దలు యువత పాల్గొన్నారు.