అక్రమ మద్యం కేసుల్లో పట్టుబడిన పాత ముద్దాయిలకు బైండోవర్
గరుగుబిల్లి, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ లో భాగంగా అక్రమ మద్యం కేసుల్లో పట్టుబడిన 14 మంది పాత ముద్దాయిలను మండల తహసిల్దార్ పి బాల వద్ద ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారులు శుక్రవారం బైండోవర్ చేశారు.ఈమేరకు సీతానగరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి పద్మావతి మాట్లాడుతూ గరుగుబిల్లి మండలం పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురు అక్రమ మద్యం కేసుల్లో పట్టు బడడం జరిగిందన్నారు. ఈ అక్రమ మద్యం కేసుల్లో పట్టుబడిన 14 మంది ముద్దాయిలను గరుగుబిల్లి మండల తహసిల్దార్ పాము బాల వద్ద బైండోవర్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం బైండోవర్ చేసిన ముద్దాయిలు ఒక సంవత్సర కాలంలో మరల అక్రమ మద్యం కేసుల్లో పట్టుబడిన యెడల ఒక లక్ష రూపాయలు జరిమానాతో పాటు ఒక సంవత్సర కాలం జైలు శిక్ష విధించబడుతుందని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి పద్మావతి తెలిపారు.మండల పరిధిలోని ఆయా గ్రామాలలో ఎవరైనా మద్యం దుకాణాలను అనధికారకంగా నిర్వహిస్తే ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.అదే విధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లు, నాటు సారా అమ్మకాలు జరిపిన ఎడల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి పద్మావతి హెచ్చరించారు. గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలు నిర్వహించిన, నాటు సారా అమ్మకాలు జరిపిన ఎడల తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు.గ్రామాల్లో అనధికారికంగా మద్యం విక్రయాలు అమ్మకాలు చేపట్టిన వ్యక్తుల వివరాలను ఎక్సైజ్ అధికారులకు తెలియజేయాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. సమాచారమును సీతానగరం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మొబైల్ నెంబర్ 8897500240కి సమాచారం అందించాలని వెల్లడించారు.