28వ డివిజన్‌లో నన్నం శ్రీనివాసులు విస్తృత ప్రచారం
నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ : నెల్లూరు రూరల్ పరిధిలో ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ అయిన 28వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నన్నం శ్రీనివాసులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. డివిజన్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ప్రచారంలో భాగంగా స్థానికులతో మమేకమవుతూ వారి మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్నారు. డివిజన్‌లో టీడీపీకి ఉన్న పార్టీ శ్రేణుల బలాన్ని దృష్టిలో ఉంచుకుని భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన వర్గాలు తెలిపాయి.