69వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా బీద మస్తాన్ రావు భారీ ర్యాలీ
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 69వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ తరఫున కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్న షేక్ షహీనా, మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్‌కు మద్దతుగా శుక్రవారం మధ్యాహ్నం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. డివిజన్‌లోని పలు వీధుల గుండా సాగిన ర్యాలీలో పార్టీ జెండాలు, నినాదాలతో ఎన్నికల ప్రచార వాతావరణం కనిపించింది. ఈ సందర్భంగా అభ్యర్థులు స్థానికులను కలుసుకుని తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.