రైల్వేకోడూరులో కూటమి 6 ఎంపీటీసీ అభ్యర్థిగా అబ్దుల్ రెహమాన్ షేక్ పోటీ
రైల్వేకోడూరు మేజర్ న్యూస్
తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో 15, 16 వార్డుల పరిధిలోని కోడూరు 6వ ఎంపీటీసీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున అబ్దుల్ రెహమాన్ షేక్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అబ్దుల్ రెహ్మాన్ షేక్ ఆయన రంగనాయకులపేట లోని నాగల పుట్ట దగ్గర పూజల నిర్వహించి ప్రచారం ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీల కూటమి తరఫున ఆయన బరిలో నిలిచారు. అబ్దుల్ రెహమాన్ షేక్ మాట్లాడుతూ15 ,16 వార్డుకు సంబంధించి 6 ఎంపీటీసీ నేను పోటీ చేస్తున్నాను ప్రజలందరూ తమను మీ ఇంటి బిడ్డలా భావించి, అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజాసమస్యలపై పోరాడుతానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రజలు యువత పాల్గొన్నారు.